హోమ్ /వార్తలు /సినిమా /

NBK: బోయపాటి శ్రీను సినిమా తర్వాత మరో క్రేజీ దర్శకుడితో బాలయ్య నెక్ట్స్ మూవీ.. ?

NBK: బోయపాటి శ్రీను సినిమా తర్వాత మరో క్రేజీ దర్శకుడితో బాలయ్య నెక్ట్స్ మూవీ.. ?

బాలకృష్ణ (Twitter/Photo)

బాలకృష్ణ (Twitter/Photo)

BB3 | బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ మరో క్రేజీ యంగ్ దర్శకుడి డైరెక్షన్‌లో నెక్ట్స్ మూవీ చేయడానిక రెడీ అవుతున్నట్టు సమచారం.

  BB3 | బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎవరనే విషయం పూటకో వార్త హల్‌చల్ చేసింది. సాయేషా సైగల్ అని కన్ఫామ్ చేసి.. చివరకు ప్రగ్యా జైస్వాల్‌‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరగుతోంది. కంచె తర్వాత ఈమె నాగార్జున, రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలో నటించింది. ఆ తర్వాత పత్తా లేకుండా పోయిన ఈ భామ అవకాశాలు లేక ఫోటో షూట్స్‌లో కాలం  గడిపింది. చివరకు బాలయ్య ఛాన్స్ దక్కడంతో ఎగిరి గంతేస్తోంది.

  ఈ సినిమా తర్వాత బాలయ్య మరో సినిమాకు ఓకే చెెప్పినట్టు సమాచారం. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో అనిల్ సుంకర నిర్మించే అవకాశాలున్నాయి. ఈ సినిమాను  రభస ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించే అవకాశాలున్నాయి.

  NBK Balakrishna Nandamuri Next Movie Santhosh Srinivas After boyapati srinu BB3,balakrishna,balakrishna boyapati movie,Balakrishna Sanathosh Srinivas,Santhosh Srinivas,Pragya Jaiswal,Balakrishna Pragya Jaiswal,NBK Pragya Jaiswal,sayyeshaa saigal twitter,namitha hot photos,sayyeshaa saigal in balakrishna movie,namitha MLA balakrishna movie,balakrishna sayyesha saigal movie,telugu cinema,బాలయ్య సయేషా సైగల్,నమిత బాలయ్య,బోయపాటి బాలయ్య సినిమాలో విలన్‌గా నమిత,బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్,బాలయ్య సరసన ప్రగ్యా,సంతోష్ శ్రీనివాస్,సంతోష్ శ్రీనివాస్ నందమూరి బాలకృష్ణ
  బాలకృష్ణ,సంతోష్ శ్రీనివాస్ (Twitter/Photo)

  ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ కథను రెడీ చేసుకున్నాడట. ఇప్పటికే నిర్మాత అనిల్ సుంకర ఈ స్టోరీ విని ఇంప్రెస్ అయ్యాడట.దీంతో ఈ కథను బాలయ్య వినిపించి ఆయన డేట్స్ సంపాదించే పనిలో పడ్డాడు. ఇక సంతోష్ శ్రీనివాస్ బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టు ఈ సినిమా స్టోరీని రెడీ చేసుకున్నాడట. ఈ సినిమాకు ‘బలరామయ్య బరిలో దిగితే’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నారట.  మరి బాలయ్య ఈ స్టోరీ విని ఓకే చెబుతారా లేదా అనేది చూడాలి.ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేస్తున్నాడు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Anil Sunkara, Balakrishna, BB3, Boyapati Srinu, NBK 106, Tollywood

  ఉత్తమ కథలు