హోమ్ /వార్తలు /సినిమా /

NBK: కరోనా రోగుల కోసం బాలయ్య చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

NBK: కరోనా రోగుల కోసం బాలయ్య చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

కరోనా రోగులకు అండగా బాలయ్య (Twitter/Photo)

కరోనా రోగులకు అండగా బాలయ్య (Twitter/Photo)

NBK: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అందరినీ భయ బ్రాంతులకు గురి చేస్తోంది. కోవిడ్‌తో  సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు అందరు బాధ పడుతున్నారు. తాజాగా కరోనా రోగుల కోసం బాలయ్య తన వంతు సాయం చేస్తున్నారు.

  NBK: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అందరినీ భయ బ్రాంతులకు గురి చేస్తోంది. కోవిడ్‌తో  సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు అందరు బాధ పడుతున్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో  సినిమా షూటింగ్స్‌ జరగడం లేదు. షూటింగ్ అంటే కేవలం హీరోలు మాత్రమే కాదు.. హీరోయిన్స్, టెక్నీషియన్స్, కెమెరామెన్‌లతో పాటు లైట్ బాయ్‌లు చాలా మందితో షూటింగ్స్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం షూటింగ్ చేసినా.. అందులో ఏ ఒక్కరికైనా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉంటే మిగతా వారికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న అమితాబ్ బచ్చన్,రాజమౌళి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్  వంటి వాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలువురు హీరోలు తమ వంతు సాయం చేస్తున్నారు.

  హీరో నందమూరి బాలకృష్ణ.. తన తల్లి బసవతారకం ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ రోగులకు వైద్యం అందజేస్తున్నారు.గతేడాది కరోనా విజృంభించిన వేళ సినిమా ఇండస్ట్రీలోని 24 విభాగాలకు చెందిన అందిరికీ బసవతారకం కాన్సర్ ఆసుపత్రి తరుపున కరోనా నిరోధానికి సంబంధించిన హోమియో పిల్స్ విటమిన్ టాబ్లెట్స్‌తో పాటు కరోనా రాకుండా నిరోధించేందకు పలు మందులను అందజేసి గొప్ప మనుసు చాటుకున్నారు. రీసెంట్‌గా బాలయ్య ఓ అభిమాని చనిపోతే.. వాళ్ల కుటుంబానికి అండగా ఉంటానంటూ ఫోన్‌లో పరామర్శించిన సంగతి తెలిసిందే కదా.

  బాలకృష్ణ (File/Photo)

  ఇక బాలయ్య హీరోగానే కాకుండా టీడీపీ నేతగా ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలతో పాటు అభిమానులకు అవసరమైన సాయం అందజేస్తున్నారు. ఈ మధ్యనే కరోనా రోగులకు అండగా రూ. 20 లక్షల విలువ చేసే మెడికల్ కిట్స్‌ను అందజేసారు. తాజాగా హిందూపురంలో కరోనాతో బాధపడుతున్న రోగుల కోసం తన గెస్ట్ హౌస్‌ను ఐసోలేషన్ సెంటర్‌గా మార్చారు. అక్కడ కరోనా పేషెంట్స్ కోసం ఫుడ్, మెడిసన్ సహా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ఈయన ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ పాటికి ఈ సినిమా విడుదలకు రెడీగా ఉండేది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మూలంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. మరోవైపు బాలయ్య.. గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: CORONA MEDICINE, NBK, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు