హోమ్ /వార్తలు /సినిమా /

NBK: OTT లో మరో రెండు మూవీస్..బాలయ్య ఫాన్స్ కి పండగే.. పండగ..

NBK: OTT లో మరో రెండు మూవీస్..బాలయ్య ఫాన్స్ కి పండగే.. పండగ..

ఓటీటీలో రిలీజ్ కానున్న బాలయ్య విక్రమసింహ భూపతి (File/Photo)

ఓటీటీలో రిలీజ్ కానున్న బాలయ్య విక్రమసింహ భూపతి (File/Photo)

నందమూరి బాలకృష్ణ.. అపుడెపుడో 17 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో ఆగిపోయిన ‘నర్తనశాల’ సినిమాను ఏటీటీ వేదిక ద్వారా విడుదల చేసారు. తాజాగా బాలయ్య గతంలో చేసి రిలీజ్ కాకుండా ఆగిపోయినా.. మరో రెండు సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...

  నందమూరి బాలకృష్ణ.. అపుడెపుడో 17 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో ఆగిపోయిన ‘నర్తనశాల’ సినిమాను ఏటీటీ వేదిక ద్వారా విడుదల చేసారు. దాదాపు  12 నిమిషాల ఫుటేజ్‌కు పాత నర్తనశాలలో నరవరా కురువరా పాటను కొంత యాడ్ చేసి 17 నిమిషాల ఫుటేజ్‌తో ఈ సినిమాను NBK థియేటర్స్, శ్రేయాస్ ఏటీటీలో విడుదల చేస్తే.. మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ. 1 కోటి 25 లక్షల కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం.  కొంత మంది బాలయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘నర్తనశాల’ సినిమా చూసి ఇది ఓ పెద్ద సైజు ట్రైలర్‌లా ఉందని విమర్శలు వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే..  మొత్తంగా బాలయ్య ఎక్కడో మరుగునపడిన ‘నర్తనశాల’ సినిమాను ఇపుడు బయటకు తీసి రిలీజ్ చేయడం మంచి పరిణామనే చెప్పాలి. అయితే.. బాలయ్య దర్శకత్వంలో నర్తనశాల కాకుండా.. మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమసింహ భూపతి’ సినిమా గురించి. నందమూరి బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో ఎనిమిదో చిత్రంగా ’విక్రమసింహ భూపతి’ ప్రారంభమైంది.

  NBK Balakrishna kodi ramakrishna vikramasimha bhupathi and ntr brahmarshi viswamitra also release in ott platform,NBK,Balakrishna,nartanasala,NBK Nartanasala,NBK Nartanasala release on ott platform,NBK NTR Jr NTR Brahmarshi viswamitra release on ott platform,balakrishna Vikramasimha bhupathi release on ott platform,kodi ramakrishna balakrishna vikramasimha bhupathi Will Release on ott,tollywood,Telugu cinema,NBK Theatre,balakrishna,బాలకృష్ణ,నర్తనశాల,బాలయ్య నర్తనశాల,నర్తనశాల ఓటీటీ రిలీజ్,బాలకృష్ణ విక్రమసింహ భూపతి ఏటీటీలో రిలీజ్,బాలయ్య విక్రమసింహ భూపతి,ఎన్బీకే బ్రహ్మర్షి విశ్వామిత్ర,నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వెర్షన్,బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్
  ఓటీటీలో రిలీజ్ కానున్న బాలయ్య విక్రమసింహ భూపతి (File/Photo)

  దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీటైన ఈ జానపద చిత్రం నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి మరణంతో ఆగిపోయింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన రోజా, పూజా బాత్రా హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాను ‘ది లయన్ కింగ్’ ఆధారంగా కోడి రామకృష్ణ తెరకెక్కించారు. కేవలం రెండు సీన్లకే పరిమితమైన నర్తనశాలను ఓటీటీ లేదా ఏటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేసిన బాలకృష్ణ.. ఈ సినిమాను కూడా ఓటీటీ లేదా ఏటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాను తెరకెక్కించాడు.

  విడుదలకు నోచుకోని ఎన్టీఆర్ ’బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్ మూవీ (Youtube/Credit)

  ఈ సినిమా తెలుగులో డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాను ఆ తర్వాత హిందీలో కూడా ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో మళ్లీ రీమేక్ చేసారు. ఇక తెలుగు ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో వేసిన దుష్యంతుడు, హరిశ్చంద్రుడు పాత్రలనే చేసాడు. ఇక హిందీ వెర్షన్‌లో దుష్యంతుడు, శకుంతల కుమారుడు పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేసాడు.

  తాత ఎన్టీఆర్ హీరోగా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్‌‌తో ముఖానికి మేకప్ వేసుకున్న తారక్.. హిందీ విశ్వామిత్ర విడుదల కాలేకపోయింది. (Facebook/Photo)

  ఆ సినిమా కంప్లీటైనా.. ఎన్టీఆర్ మాత్రం తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమాను  హిందీలో విడుదల చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో చిన్న ఎన్టీఆర్ హిందీని అనర్గళంగా మాట్లాడం చూసి పెద్ద ఎన్టీఆర్ హిందీ వెర్షన్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో తారక్‌ను తీసుకున్నారు. కానీ తెలుగులో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో హిందీ వెర్షన్‌కు సంబంధించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీటైన హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ చిత్రాన్ని అన్నగారు విడుదల చేయకుండా హోల్ట్‌లో పెట్టారు. ఆ తర్వాత పెద్ద ఎన్టీఆర్ రాజకీయాలతో బిజీ కావడం వంటి కొన్ని కారణాలతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే కాకుండా సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన ఈ సినిమా విడుదల కాకపోవడం విశేషం. ఈ రకంగా నందమూరి కుటుంబంలో ముగ్గురు హీరోలు నటించిన ఈ సినిమా విడుదల కాకపోవడం యాదృచ్ఛికమనే చెప్పాలి.

  బాలకృష్ణ ‘నర్తనశాల’ మూవీ (Twitter/Photo)

  ఒకవేళ ఈ సినిమాను కూడా ఓటీటీ లేదా ఏటీటీలో విడుదల చేస్తే.. మూడు తరాలకు చెందిన నందమూరి హీరోలు నటించిన హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు దక్కుతోంది. మరి నర్తనశాల సినిమాకే మోక్షం ప్రసాదించిన బాలయ్య.. ఈ రెండు సినిమాలను ఓటీటీ లేదా ఏటీటీలో విడుదల చేస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. మరి బాలయ్య రిలీజ్ కాకుండా ఆగిపోయినా.. ఈ రెండు సినిమాలకు ఎపుడు మోక్షం కలిగిస్తాడో చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Bollywood, Jr ntr, NBK Nartanasala, NTR, Tollywood

  ఉత్తమ కథలు