హోమ్ /వార్తలు /సినిమా /

NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

‘సమరసింహారెడ్డి’గా బాలయ్య (File/Photo)

‘సమరసింహారెడ్డి’గా బాలయ్య (File/Photo)

NBK : నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో  బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సమరసింహారెడ్డి’ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ముందుగా ఈ సినిమాలో అనుకున్న హీరో బాలయ్య కాదట.

NBK : నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna) సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో  బి.గోపాల్ (B Gopal) దర్శకత్వంలో తెరకెక్కిన ‘సమరసింహారెడ్డి’ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కంటే ముందు వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘లారీ డ్రైవర్’ ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఏడేళ్ల తర్వాత దర్శకుడు బి.గోపాల్, హీరో బాలకృష్ణ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘సమరసింహారెడ్డి’, ఈ చిత్రం తెలుగులో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను క్రాస్ చేసింది. అంతేకాదు తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అంతకు ముందు వెంకటేష్ ‘ప్రేమించుకుందాం ..రా’, ‘ మోహన్ బాబు ‘శ్రీరాములయ్య’ సినిమాలు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కినా.. ‘సమరసింహారెడ్డి’ మూవీ మాత్రం ఈ జానర్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

‘సమరసింహారెడ్డి’ సక్సెస్‌తో తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలు క్యూ కట్టాయి. దాదాపు తెలుగులో అందరు హీరోలు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో సినిమాలు చేసి మంచి సక్సెస్‌లు అందుకున్నారు. ఒక రకంగా తెలుగులో ‘సమరసింహారెడ్డి’ ఫ్యాక్షన్ సినిమాల ఒరవడికి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్’ పతాపంపై చెంగల వెంట్రావు నిర్మించారు.

బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’

ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద కథను అందించారు. రత్నాకర్ కథా సహాకారం అందించారు. పరుచూరి బ్రదర్స్ పవర్‌ఫుల్ డైలాగ్స్ రాసిన ఈ సినిమా 1999 జనవరి 13న విడుదలై అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. దాదాపు రూ. 6  కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 20 కోట్లకు పైగా షేర్ సాధించింది.

Happy Birthday Nandamuri Balakrishna NBK-B Gopal Hero Nandamuri Balakrishna director B Gopal Tollywood Block Bluster Combination,HBD NBK - B Gopal: టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నట సింహా బాలకృష్ణ, దర్శకుడు బి గోపాల్..,HBD Balakrishna,HBD NBK,Happy Birthday Nandamuri Balakrishna,B Gopal,b Gopal,balakrishna,b gopal,b gopal balakrishna lorry driver,b gopal balakrishna rowdy inspector,b gopal balakrishna samara simha reddy,b gopal balakrishna narasimha naidu, bezawada gopal balakrishna,balayya,balayya,jai balayya,balakrishna 60th birthday,balayya 60th birthday,tollywood,బాలకృష్ణ నందమూరి,బి గోపాల్,బెజవాడ గోపాల్,బి గోపాల్ బాలకృష్ణ సూపర్ హిట్ కాంబినేషన్,బాలయ్య రౌడీ ఇన్‌స్పెక్టర్,లారీ డ్రైవర్,సమర సింహారెడ్డి,నరసింహానాయుడు, పలనాటి బ్రహ్మనాయుడు,హ్యాపీ బర్త్ డే నందమూరి బాలకృష్ణ
బాలకృష్ణ, బి.గోపాల్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ (Twitter/Photo)

అయితే ముందుగా ఈ సినిమాలో హీరోగా బాలయ్యను అనుకోలేదట. ముందుగా ఈ సినిమా స్టోరీని దర్శకుడు బి.గోపాల్ .. వెంకటేష్‌కు వినిపించారట.అప్పటికే బి.గోపాల్ .. వెంకటేష్‌తో ‘రక్త తిలకం’, ‘బొబ్బలి రాజా’, చినరాయుడు’ సినిమాలు తెరకెక్కించారు. అందులో రక్త తిలకం సినిమా హిట్‌గా నిలిస్తే.. ‘బొబ్బలి రాజా’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ‘చినరాయుడు’ మాత్రం యావరేజ్‌గా నిలిచింది.

NBK Nandamuri Balakrishna Victory Venkatesh Done Same Story Line Movie And Released Same Day Here Are the Details,Balakrishna-Venkatesh: ఒకే రోజు ఒకే లైన్ కథతో బాక్సాఫీస్ బరిలో దిగిన బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలేవో తెలుసా..,Balakrishna,Venkatesh,Balakrishna Venkatesh,Balakrishna Ashoka Chakravarthy,venkatesh Dhruva Nakshatram,Balakrishna Ashoka Chakravarthy venkatesh Dhruva Nakshatram,Mohanlal Aryan,Venaktesh Balakrishna Box Office War,Tollywood,Telugu cinema,Ashoka Chakravarthy Movie,Dhruva Nakshatram Movie,Telugu cinema,Tollywood,NBK,Balakrishna Nandamuri,బాలకృష్ణ,వెంకటేష్,బాలకృష్ణ వెంకటేష్,ఒకేరోజు బాక్సాఫీస్ బరిలో వెంకటేష్ బాలకృష్ణ,వెంకటేష్ ధృవనక్షత్రం,బాలకృష్ణ అశోక చక్రవర్తి,ఒకేరోజు విడుదలైన ధృవనక్షత్రం,అశోక చక్రవర్తి
బాలకృష్ణ,వెంకటేష్ (Twitter/Photos)

ఇక దర్శకుడు గోపాల్ కథ విని వెంకటేష్.. స్టోరీ చాల ా బాగుంది.  ఈ స్టోరీని ఎవరైనా మాస్ హీరో చేస్తే బాగుంటుందని వెంకీ సలహా ఇచ్చారట.నాకు ఈ కథ సెట్ కాదు. నా కన్న మాస్ ఇమేజ్ ఎక్కువ ఉన్న హీరోతో చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారట. దీంతో బి.గోపాల్ , బాలకృష్ణను కలిసి కథ వినిపించడం, ఆయన ఓకే చేసేయడం ఈ సినిమా పట్టాలెక్కడం అన్ని చకచకా జరిగిపోయాయి. 

Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

ఆ తర్వాత ‘సమరసింహారెడ్డి’ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత బాలయ్య, బి.గోపాల్ కాంబినేష్‌లో ‘నరసింహనాయుడు’ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. చివరగా వీళ్ల కాంబినేషన్‌లో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా వచ్చింది.

Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ‘హర హర మహదేవ’ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన ఎందుకో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఏమైనా బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలనుకునే అభిమానులు ఉన్నారు.

First published:

Tags: B.Gopal, Balakrishna, NBK, Tollywood, Venkatesh, Vijayendra Prasad

ఉత్తమ కథలు