హోమ్ /వార్తలు /సినిమా /

NBK: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ..

NBK: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ..

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని (File/Photo)

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని (File/Photo)

NBK | నందమూరి నట సింహం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ గురించి గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.ఈ కాంబినేషన్‌లో సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

  NBK | నందమూరి నట సింహం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ గురించి గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా సత్తా చూపెడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఇక బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో సినిమా విషయమై తాజాగా ’ఉప్పెన’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. ఈ  సినిమాను మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.  బాలయ్య సోలో హీరోగా నటించిన సినిమా తండ్రి పుట్టినరోజున విడుదల కావడం ఇదే మొదటిసారి. గతంలో బాలయ్య, తన తండ్రితో కలిసి నటించిన ‘శ్రీమద్విరాట పర్వం’ అనే సినిమా మాత్రమే ఎన్టీఆర్ బర్త్ డే రోజున విడుదలైంది. ఒక రకంగా ఎన్టీఆర్ పుట్టినరోజున విడుదల కాబోతున్న బాలయ్య రెండో సినిమా అనే చెప్పాలి.

  సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్లో కవల సోదరులుగా నటిస్తున్నాడు. అంతేకాదు ఒకటి అఘోర పాత్ర అయితే.. మరొకటి కలెక్టర్ పాత్ర అని చెబుతున్నారు. తాజాగా విడుదలైన ‘అఘోర’ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  balakrishna as aghora,aghora balakrishna exclusive still BB3,balakrishna aghora,balakrishna twitter,balakrishna aghora look,aghora look for balakrishna,balakrishna as aghora,nandamuri balakrishna,నందమూరి బాలకృష్ణ,అఘోరాగా బాలయ్య,అఘోరాగా నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమాలో
  అఘోరాగా బాలయ్య (Balakrishna as Aghora)

  మరోవైపు బాలయ్య బోయపాటి శ్రీను తర్వాత వరుసగా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే బాలకృష్ణ.. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ‘బలరామయ్య బరిలోదిగితే’ అనే టైటిల్ అనుకుంటున్నారు.ఆ సంగతి పక్కన పెడితే.. బాలకృష్ణ రీసెంట్‌గా రవితేజ‌తో ‘క్రాక్’ వంటి పోలీస్ మాస్ యాక్షన్ మూవీతో మెప్పించి సంక్రాంతి విజేతగా నిలిచింది. అంతేకాదు కరోనా తర్వాత రిలీజై.. బ్లాక్ బస్టర్ టాక్‌ సొంతం చేసుకున్న తొలి మూవీగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు ఈ సినిమా సక్సెస్‌తో నిర్మాతలకు హీరోలకు ఓ భరోసా వచ్చింది.

  NBK Balakrishna Nandamuri Will Work With Krack Movie Director Gopichand Malineni Here Are The Details, NBK: బోయపాటి శ్రీను సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ దర్శకుడితో బాలయ్య నెక్ట్స్ మూవీ.. ?,balakrishna,Gopichand Malineni,Gopichand Malineni,balakrishna boyapati movie,Balakrishna Sanathosh Srinivas,Santhosh Srinivas,Pragya Jaiswal,Balakrishna Pragya Jaiswal,NBK Pragya Jaiswal,sayyeshaa saigal twitter,namitha hot photos,sayyeshaa saigal in balakrishna movie,namitha MLA balakrishna movie,balakrishna sayyesha saigal movie,telugu cinema,బాలయ్య సయేషా సైగల్,నమిత బాలయ్య,బోయపాటి బాలయ్య సినిమాలో విలన్‌గా నమిత,బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్,బాలయ్య సరసన ప్రగ్యా,సంతోష్ శ్రీనివాస్,సంతోష్ శ్రీనివాస్ నందమూరి బాలకృష్ణ,గోపీచంద్ మలినేని,బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్,గోపీచంద్ మలినేనితో బాలయ్య సినిమా
  బాలకృష్ణ, గోపీచంద్ మలినేని (File/Photo)

  బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ పేరు వినబడుతున్న అఫీషియల్ ప్రకటన మాత్రం వెలుబడలేదు. కానీ రీసెంట్‌గా ‘ఉప్పెన’ ప్రమోషన్‌లో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

  ఇప్పటికే గోపిచంద్ మలినేని .. బాలయ్య ఇమేజ్‌కు తగ్గ  కథను వినిపించి ఓకే  చేయించుకున్నాడు. బాలయ్య కూడా ఇప్పట్లో మంచి ముహూర్తలు లేనందున మే లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి.. అప్పటి నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఇక బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను మార్చి సెకండ్ వీక్‌‌లో గుమ్మడికాయ కొట్టేయనున్నారు. మరోవైపు బాలయ్య.. పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడితో పాటు శ్రీవాస్, బి.గోపాల్‌లతో నెక్ట్స్ ప్రాజెక్టులు ఓకే చేసినట్టు సమాచారం. మొత్తంగా బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో చేయడం ఖరారైంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Balayya, BB3, Gopichand malineni, Mythri Movie Makers, NBK, NBK 107, Tollywood

  ఉత్తమ కథలు