Home /News /movies /

NBK AKHANDA BALAKRISHNA NANDAMURI BOYAPATI SRINU AKHANDA RELEASE DATE OFFICIALLY ANNOUNCED WILL SOON HERE ARE THE DETAILS TA

BalaKrishna- Akhanda : ‘అఖండ’ విడుదల తేది ఖరారు.. బాలయ్య సినిమాతో థియేటర్స్‌లో భారీ చిత్రాల సందడి..

‘అఖండ’ విడుదల తేది ఖరారు (Akhanda title song Photo : Twitter)

‘అఖండ’ విడుదల తేది ఖరారు (Akhanda title song Photo : Twitter)

BalaKrishna- Akhanda : ‘అఖండ’ విడుదల తేది ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీల వర్గాలు. వివరాల్లోకి వెళితే..

    BalaKrishna- Akhanda : ‘అఖండ’ విడుదల తేది ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీల వర్గాలు. నందమూరి నట సింహా బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన ‘అఖండ’ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశారు.  ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదలైన ’అఖండ’(Akhanda) టైటిల్ పోస్టర్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు టాలీవుడ్‌లో తక్కువ టైమ్‌లో 50M వ్యూస్ క్రాస్ చేసిన టీజర్‌గా బాలకృష్ణ ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ‘అఖండ’ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారు. ఒకటి కలెక్టర్ పాత్ర అయితే. .రెండోది ఫ్యాక్షనిస్ట్, మూడోది అఘోర అని ఈ సినిమా పోస్టర్స్‌ బట్టి అభిమానులు అంచనా వేస్తున్నారు.

    ఇప్పటికే ‘అఖండ’ మూవీ నుంచి  విడుదల చేసిన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా  జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. మరో కథానాయికగా పూర్ణ యాక్ట్ చేస్తోంది.ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సంబంధించ అగ్రిమెంట్స్ పూర్తైనట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన అఘోర పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    BalaKrishna - Nani : నందమూరి బాలకృష్ణకు నాని మధ్య ఉన్న ఈ అనుబంధం తెలుసా..


    ‘అఖండ’ సినిమా విషయానికొస్తే.. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌ హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, తెలంగాణ (నైజాం) ప్రాంతం రూ. 10 కోట్లుకు అమ్మడుపోయినట్టు సమాచారం. ఇక రాయలసీమ (సీడెడ్)  హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

    Balakrishna Remakes: నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

    ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. ‘అఖండ’ సినిమా తర్వాత బాలయ్య.. గోపీచంద్ మలినేని తో నెక్ట్స్ మూవీ చేయనున్నారు.  గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2021 సంక్రాంతికి రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.

    IMDB : 2021లో ‘జై భీమ్’ సహా IMDBలో టాప్ రేటింగ్ దక్కించుకున్న భారతీయ సినిమాలు ఇవే..


    పల్నాడు బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్, భావన నటిస్తున్నారు. మరోవైపు బాలయ్య.. ఆహా ఓటీటీ కోసం ఓ టాక్ షో చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. మోహన్ బాబు గెస్ట్‌గా వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వారం రెండో ఎపిసోడ్‌కు నాని ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ ఎపిసోడ్‌లో బాలయ్య .. నానిని ఏయే ప్రశ్నలు అడుగుతారనే విషయమై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akhanda, Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations, Miryala Ravinder Reddy, NBK, Pragya jaiswal, Tollywood

    తదుపరి వార్తలు