Home /News /movies /

NBK AKHANDA BALAKRISHNA NANDAMURI BOYAPATI SREENU AKHANDA MOVIE JAI BALAYYA SONG RELEASED TA

NBK - Akhanda : బాలకృష్ణ ‘అఖండ’ మూవీ నుంచి ‘జై బాలయ్య’ సాంగ్ విడుదల.. వైరల్ అవుతున్న పాట..

‘అఖండ’ మూవీ నుంచి జై బాలయ్య ఫుల్ సాంగ్ విడుదల (Twitter/Photo)

‘అఖండ’ మూవీ నుంచి జై బాలయ్య ఫుల్ సాంగ్ విడుదల (Twitter/Photo)

NBK - Akhanda - Jai Balayya : నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. తాజాగా ఈ సినిమాలోని ‘జై బాలయ్య’ సినిమాలోని ఫుల్ సాంగ్‌ను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...
    NBK - Akhanda - Jai Balayya : నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా 39 రోజులు గడిచినా కూడా ‘అఖండ’ ఇంకా  బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని ప్రభంజనం ఇది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇచ్చారు.  అఖండ సినిమా 39 రోజుల్లో  వారాల్లో రూ. 72. 63 కోట్లకు పైగా షేర్ (127.75 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

    ఇక ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు పాటలు కూడా అంతే పాపులర్ అయ్యాయి. టైటిల్ సాంగ్ ’అఖండ’తో పాటు ‘జై బాలయ్య’ పాటకు మాస్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి జై బాలయ్య ఫుల్ సాంగ్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


    ఈ సినిమా పదిరోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్‌కి చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. అఖండ 6వ వారంలోకి ఎంటర్ అయ్యి ఇప్పటికీ అదిరిపోయే కలెక్షన్స్ ని సాధిస్తోంది. ఇక 39వ రోజు కూడా రూ. 11 లక్షల షేర్ రాబట్టి ఔరా అనిపించింది.

    6వ వారంలో ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ‘అఖండ’ (Twitter/Photo)


    నైజాం(తెలంగాణ) : రూ. 20.64 కోట్లు (వచ్చింది)/ రూ. 10.5 కోట్లు (అమ్మింది)
    సీడెడ్ (రాయలసీమ): రూ. 15.63 కోట్లు / రూ. 10.6 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ.6.25 కోట్లు / రూ. 6 కోట్లు
    ఈస్ట్:రూ. 4.20 కోట్లు / రూ.4.00 కోట్లు
    వెస్ట్: రూ.4.18 కోట్లు / రూ.3.5 కోట్లు
    గుంటూరు:రూ. 4.74 కోట్లు /రూ. 5.4 కోట్లు
    కృష్ణా: 3.63 కోట్లు /రూ. 3.7 కోట్లు
    నెల్లూరు: రూ.2.62 కోట్లు /రూ. 1.8 కోట్లు

    ఏపీ-తెలంగాణ టోటల్: రూ. 61.89 కోట్లు / రూ. 45.50
    ఓవర్సీస్ + రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: రూ.10.74 కోట్లు / రూ.7.5 కోట్లు
    టోటల్ వరల్డ్ వైడ్ 39 డేస్ కలెక్షన్స్: రూ.72.63 కోట్లు షేర్ (రూ. 127.75 కోట్ట గ్రాస్ వసూళ్లు)  రూ.53 కోట్లు..

    Mahesh Babu -Ramesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు సాధ్యం కానీ ఆ రికార్డు.. రమేష్ బాబుకు సాధ్యమైంది..



     అఖండ సినిమాకు ఇంత కలెక్షన్స్ ప్రభంజనం కురిసినా కూడా ఇప్పటికీ రెండు చోట్ల సినిమా సేఫ్ అవ్వలేదు. టోటల్‌గా గుంటూరు, కృష్ణా మినహా మిగిలిన చోట్ల మాత్రం అఖండకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి.రూ.  53 కోట్ల బిజినెస్ చేస్తే.. ఏకంగా రూ. 72.27 కోట్లు షేర్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది అఖండ. ఈ  సినిమాను ఈ నెల 21న హాట్ స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్  కానున్నట్లు తాజా సమాచారం. ఇక మరోవైపు అఖండ టెలివిజన్ ప్రిమియర్ విషయంలో కూడా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా.. అఖండ సినిమాను ఫిబ్రవరి 27 న ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.






    ఇక చివరగా అఖండ సినిమా జనవరి 20న అఫీషియల్ గా 50 రోజుల పండగను జరుపుకోనుంది. ఇండస్ట్రీలో 50 రోజులు ఓ సినిమా పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. సినిమా రిలీజ్ కాస్త మిక్స్ డ్ టాక్ వస్తేనే నెల తిరిగే లోపు ఓటీటీలో పడిపోతోంది. అలాంటి నేపథ్యంలో అఖండ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రోజులు ఆడటం మామూలు విషయం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

    Allu Arjun - Pushpa : హిందీ వెర్షన్‌లో కుమ్మేస్తేన్న ‘పుష్ప’ మూవీ.. కలెక్షన్స్ విషయంలో తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్..

    ఇక సుదర్శన్ 35 ఎంఎం వేదికగా ఈ వేడుకలు నిర్వహంచనున్నట్లు తెలిసింది. అంతేకాదు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సైతం 50 రోజుల వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారట. ఇందుకోసం నిర్మాత స్వస్థలం అయిన సూర్యపేటలో భారీ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు బాలయ్యతో పాటు, సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత సిసలైన క్లీన్ బ్లాక్ బస్టర్ సినిమాగా అఖండ నిలిచిందని బాలయ్య ఫ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akhanda movie, Balakrishna, Balayya, NBK, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు