Home /News /movies /

NBK AKHANDA BALAKRISHNA NANDAMURI AKHANDA MOVIE NEW TRAILER RELEASED TA

NBK - Akhanda : బాలకృష్ణ ‘అఖండ’ మూవీ నుంచి కొత్త ట్రైలర్ విడుదల..

‘అఖండ’గా బాలకృష్ణ (Twitter/Photo)

‘అఖండ’గా బాలకృష్ణ (Twitter/Photo)

NBK - Akhanda - Jai Balayya : నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ మూవీ 50 రోజులకు చేరువలో ఉన్న సందర్భంగా ఈ సినిమా నుంచి సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  NBK - Akhanda - Jai Balayya : నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా 6 వారంలో కూడా  ‘అఖండ’ ఇంకా  బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని ప్రభంజనం ఇది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇచ్చారు.  అఖండ సినిమా 6  వారాల్లో రూ. 73 కోట్లకు పైగా షేర్ (130 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

  ఇక ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు పాటలు కూడా అంతే పాపులర్ అయ్యాయి. టైటిల్ సాంగ్ ’అఖండ’తో పాటు ‘జై బాలయ్య’ పాటకు మాస్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా  ఈ సినిమా నుంచి జై బాలయ్య ఫుల్ సాంగ్‌ను  విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే గురువావారం జనవరి 20 తో ఈ సినిమా 50 రోజుల పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో ట్రైలర్‌ను విడుదల చేశారు.

   ఈ సినిమా పదిరోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్‌కి చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. అఖండ 6వ వారంలోకి ఎంటర్ అయ్యి ఇప్పటికీ అదిరిపోయే కలెక్షన్స్ ని సాధిస్తోంది. 6వ వారంలో ఇరగదీసింది. సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలతో కూడా ‘అఖండ’ పోటీ పడుతోంది.

  బాలకృష్ణ ‘అఖండ’ ప్రభంజనం (Twitter/Photo)


  అఖండ సినిమాకు ఇంత కలెక్షన్స్ ప్రభంజనం కురిసినా కూడా ఇప్పటికీ రెండు చోట్ల సినిమా సేఫ్ అవ్వలేదు. టోటల్‌గా గుంటూరు, కృష్ణా మినహా మిగిలిన చోట్ల మాత్రం అఖండకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి.రూ.  53 కోట్ల బిజినెస్ చేస్తే.. ఏకంగా రూ. 73 కోట్లు షేర్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది అఖండ. ఈ  సినిమాను ఈ నెల 21న హాట్ స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్  కానుంది.  ఇక మరోవైపు అఖండ టెలివిజన్ ప్రిమియర్ విషయంలో కూడా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా.. అఖండ సినిమాను ఫిబ్రవరి 27 న ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.


  ఇక చివరగా అఖండ సినిమా జనవరి 20న అఫీషియల్ గా 50 రోజుల పండగను జరుపుకోనుంది. ఇండస్ట్రీలో 50 రోజులు ఓ సినిమా పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. సినిమా రిలీజ్ కాస్త మిక్స్ డ్ టాక్ వస్తేనే నెల తిరిగే లోపు ఓటీటీలో పడిపోతోంది. అలాంటి నేపథ్యంలో అఖండ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రోజులు ఆడటం మామూలు విషయం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

  Khaidi No 150 : ఐదేళ్లు పూర్తి చేసుకున్న చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’.. మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే..

  ఇక సుదర్శన్ 35 ఎంఎం వేదికగా ఈ వేడుకలు నిర్వహంచనున్నట్లు తెలిసింది. అంతేకాదు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సైతం 50 రోజుల వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం నిర్మాత స్వస్థలం అయిన సూర్యపేటలో భారీ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు బాలయ్యతో పాటు, సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత సిసలైన క్లీన్ బ్లాక్ బస్టర్ సినిమాగా అఖండ నిలిచిందని బాలయ్య ఫ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akhanda movie, Balakrishna, NBK, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు