హోమ్ /వార్తలు /సినిమా /

NBK- Akhada: టాలీవుడ్‌ చరిత్ర తిరగరాసిన అఖండ టీజర్.. బాలయ్య దూకుడు ముందు అన్ని రికార్డులు ఫసక్..

NBK- Akhada: టాలీవుడ్‌ చరిత్ర తిరగరాసిన అఖండ టీజర్.. బాలయ్య దూకుడు ముందు అన్ని రికార్డులు ఫసక్..

NBK- Akhada: టాలీవుడ్‌ చరిత్ర తిరగరాసిన అఖండ టీజర్.. బాలయ్య అఖండ టీజర్ ముందు సీనియర్, జూనియర్ అనే తేడా లేదు. అన్ని రికార్డులు మటు మాయం అవుతున్నాయి.

NBK- Akhada: టాలీవుడ్‌ చరిత్ర తిరగరాసిన అఖండ టీజర్.. బాలయ్య అఖండ టీజర్ ముందు సీనియర్, జూనియర్ అనే తేడా లేదు. అన్ని రికార్డులు మటు మాయం అవుతున్నాయి.

NBK- Akhada: టాలీవుడ్‌ చరిత్ర తిరగరాసిన అఖండ టీజర్.. బాలయ్య అఖండ టీజర్ ముందు సీనియర్, జూనియర్ అనే తేడా లేదు. అన్ని రికార్డులు మటు మాయం అవుతున్నాయి.

  NBK- Akhada: టాలీవుడ్‌ చరిత్ర తిరగరాసిన అఖండ టీజర్.. బాలయ్య అఖండ టీజర్ ముందు సీనియర్, జూనియర్ అనే తేడా లేదు. అన్ని రికార్డులు మటు మాయం అవుతున్నాయి. తెలుగులో మాస్ జనాల్లో బాలయ్య కున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.  ఆయన ఇమేజ్‌కు తగ్గ స్టోరీ పడితే.. దాని ఇంపాక్ట్ బాక్సాఫీస్ పై ఎలా ఉంటుందో మరోసారి ‘అఖండ’ టీజర్ ప్రూవ్ చేసింది. ముఖ్యంగా  ‘లెజెండ్’ సినిమాలో బాలయ్య చెప్పిన ఓ డైలాగ్ గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.  స్టేట్ అయినా సెంట్రల్ అయినా.. పొజిషన్ అయినా.. అపొజిషన్ అయినా.. నేను దిగనంత వరకే .. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగానే ఉంది బాలయ్య దూకుడును చూస్తుంటే. నిజంగా బాలయ్య అఖండ టీజర్‌తో అడుగుపెట్టి.. టాలీవుడ్ అన్ని రికార్డులను పాతర వేస్తూనే ఉన్నారు. గతంలో బాలయ్య సినిమాలకు సోషల్ మీడియాలో  అంతగా ఫాలోయింగ్  ఉండేది కాదు. కానీ అఖండ టీజర్‌తో వాటన్నింటినీ పటాపంచలు చేసారు.

  ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజర్ దూకుడు మాత్రం ఆగడం లేదు. పూటకో రికార్డును మటాష్ చేస్తూ.. తాజాగా ఈ సినిమా 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ టీజర్ విడుదలైన 17 రోజుల్లో అత్యంత తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించింది. అత్యంత తక్కువ సమయంలో 50 మిలియన్ వ్యూస్ సంపాదించిన టీజర్‌గా బాలయ్య చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇక ఉగాది సందర్భంగా ఈ సినిమా పేరును దీనికి సంబంధించి ఓ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. టాలీవుడ్‌లో రీసెంట్‌గా అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా అతి తక్కువ సమయంలో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అది కూడా మూడు వారాల తర్వాత. కానీ బాలయ్య మాత్రం 17 రోజుల్లో అన్ని రికార్డులను మడత పెట్టి ఇస్త్రీ చేసేసారు.

  'అఖండ' టీజర్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. . ఈ టీజర్‌లో బాలకృష్ణ గెటప్.. దీనికి తోడు బ్యాగ్రౌండ్ స్కోర్.. ఆయన చెప్పిన డైలాగ్‌లు అభిమానులతో పాటు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో తెగ వైరల్ అవుతోంది టీజర్. ఇప్పటికే దక్షిణాదిలో సీనియర్ హీరోల టీజర్ రికార్డులను బద్దలు కొట్టిన బాలయ్య.. ఇపుడు తెలుగులో జూనియర్ హీరోల రికార్డులను బ్రేక్ చేసే పనిలో పడ్డారు.

  ‘అఖండ’లో నందమూరి బాలకృష్ణ (Twitter/Photo)

  బోయపాటి శ్రీను, బాలయ్య  కాంబినేషన్‌లో గతంలో  ‘సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అఖండలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

  ఇక ఈ సినిమాకు బిజినెస్ అప్పుడే ఓ రేంజ్‌లో జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుందట. అందులో భాగంగా స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ఏకంగా  10 కోట్ల రూపాయలకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు క్రాక్ డైరక్టర్ గోపీచంద్ తో దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమా చేయనున్నట్టు సమాచారం.

  First published:

  Tags: Akhanda, Balakrishna, Boyapati Srinu, NBK, Tollywood

  ఉత్తమ కథలు