హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna | NBK 107 : సిరిసిల్లలో మొదలైన బాలయ్య గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్..

Balakrishna | NBK 107 : సిరిసిల్లలో మొదలైన బాలయ్య గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్..

ఈ సినిమాలో శృతి హాసన్ కాకుండా మరో హీరోయిన్ కూడా నటించబోతుంది. ఈ పాత్ర కోసం చాలా మందిని సంప్రదిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ పాత్ర కోసం ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టిని సంప్రదిస్తే.. దానికి ఆమె సున్నితంగా నో చెప్పిందని తెలుస్తుంది. ప్రస్తుతం కృతి శెట్టి కెరీర్ టాప్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ఉప్పెన తర్వాత విడుదలైన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు కూడా బాగానే ఆడటంతో అమ్మడు దూకుడు మీదుంది.

ఈ సినిమాలో శృతి హాసన్ కాకుండా మరో హీరోయిన్ కూడా నటించబోతుంది. ఈ పాత్ర కోసం చాలా మందిని సంప్రదిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ పాత్ర కోసం ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టిని సంప్రదిస్తే.. దానికి ఆమె సున్నితంగా నో చెప్పిందని తెలుస్తుంది. ప్రస్తుతం కృతి శెట్టి కెరీర్ టాప్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ఉప్పెన తర్వాత విడుదలైన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు కూడా బాగానే ఆడటంతో అమ్మడు దూకుడు మీదుంది.

Balakrishna | NBK 107 : బాలయ్య దర్శకుడు గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ మొదలైందని సమాచారం. బాలయ్య 107వ సినిమా వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ గా ఈరోజు తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతంలో మొదలైంది.

ఇంకా చదవండి ...

  నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna) ఈ మధ్య అఖండ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య (Balakrishna) దర్శకుడు గోపీచంద్ (Gopichand Malineni) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ మొదలైందని సమాచారం. బాలయ్య 107వ సినిమా వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ గా ఈరోజు తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతంలో మొదలైంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ (Shruti Haasan)  హీరోయిన్‌గా నటిస్తున్నారు. గతంలో (Gopichand Malineni)  గోపీచంద్ డైరెక్ట్ చేసిన ‘క్రాక్’ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్నారు శృతి (Shruti Haasan). ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య (Balakrishna) డ్యూయెల్ రోల్ చేయబోతుండడంతో పాటు.. ఒక పాత్రలో స్వామీజీగా కనిపించనున్నారట. మరో పాత్ర కోసం ఫ్యాక్షన్ లీడర్ కనిపిస్తారని సమాచారం. దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో  కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే  పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

  ఈ సినిమాకు వేట పాలెం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తాజాగా ‘పెద్దాయన’ టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక బాలయ్య ఇమేజ్‌కు తగ్గ సరైన టైటిల్ అంటున్నారు అభిమానులు. ఒక హీరో పట్నానికి చెందిన వ్యక్తి అయితే.. మరోకరు ఊరిలో ఉన్న ’పెద్దాయన’. మొత్తంగా ఈ టైటిల్ ఫిక్స్ అయితే.. అభిమానులకు అంత కన్నా ఆనందం ఉండదు. ఇక గోపీచంద్ (Gopichand Malineni)  విషయానికి వస్తే.. గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ మధ్య రవితేజ హీరోగా గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. మంచి విజయాన్ని అందుకుంది.

  Janhvi Kapoor : జాన్వీ పరువపు పొంగులు.. మరోసారి కేక పెట్టించిన శ్రీదేవి కూతురు..

  ప్రస్తుతం బాలయ్య.. సినిమాలతో పాటు ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి సినిమా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ షోకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే మొదటి సీజన్‌ను పూర్తి చేసుకున్న ఈ షోకు సంబంధించి త్వరలో రెండవ సీజన్‌ మొదలుకానుంది. ఆహాలో అత్యధిక వ్యూస్ తీసుకొస్తున్న షోగా ఇది రికార్డులు తిరగరాస్తుంది. మన దేశంలో నంబర్ వన్ టాక్ షోగా నిలిచింది.  పైగా బాలయ్య హోస్టింగ్ కూడా కేక పెట్టిస్తుంది. తనను తాను చాలా మార్చుకున్నారు బాలయ్య.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Balakrishna, Shruthi haasan, Tollywood news

  ఉత్తమ కథలు