Home /News /movies /

NBK 107 NANDAMURI BALAKRISHNA GOPICHAND MALINENI MOVIE FIRST HUNT TODAY ONWORDS TA

NBK 107- Balakrishna | బాలకృష్ణ వేటకు టైమ్ ఫిక్స్.. నందమూరి నట సింహం రంగంలోకి దిగేది అపుడే..

బాలకృష్ణ 107వ చిత్రంపై క్రేజీ అప్‌డేట్ ( Balakrishna Photo : Twitter)

బాలకృష్ణ 107వ చిత్రంపై క్రేజీ అప్‌డేట్ ( Balakrishna Photo : Twitter)

NBK 107- Balakrishna | నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107వ చిత్రం చేస్తున్నారు. రేపు బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ రోజు సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ ట్రీట్ చేయనున్నారు.

    NBK -107 - Balakrishna - Gopichanda Malineni : గతేడాది చివర్లో  బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ సక్సెస్  తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభమైంది అక్కడ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైయింది. రీసెంట్‌గా ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా సిరిసిల్లలో ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభమైంది.  ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో  కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో దునియా విజయ్.. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బాలయ్యకు సంబంధించిన రెండు లుక్స్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

    తాజాగా ఈ శుక్రవారం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ  సినిమాకు సంబంధించిన ఫస్ట్ హంట్ అంటూ ఓ ట్రీట్ ఇవ్వనున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు టీజర్‌ను విడుదల చేస్తారా ? కేవలం టైటిల్‌ను మాత్రమే ప్రకటిస్తారా అనేది చూడాలి.


    ఈ సినిమాలో లేడీ విలన్‌గా పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే  పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇక క్రాక్‌లో కథానాయికగా నటించిన శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది.ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

    Balakrishna Remakes: మంగమ్మ మనవడు టూ లక్ష్మీ నరసింహా వరకు బాలయ్య రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

    ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్‌లో బ్లాక్ లుంగీలో పక్కన పెద్ద బండి పక్కన ఎంతో మాస్‌గా ఉంది.



    ఈ సినిమాకు ‘పెద్దాయన,’ తో పాటు అన్నగారు, వేట పాలెం అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు ‘రెడ్డిగారు’ అనే మరో పేరు పరిశీలనకు వచ్చింది. మరి బాలయ్య సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారనేది మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Balakrishna, NBK 107, Tollywood

    తదుపరి వార్తలు