NBK -107 - Balakrishna - Gopichanda Malineni : గతేడాది చివర్లో బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. బాలయ్య పనైపోయిందన్న వాళ్లకు ఈ సినిమా సక్సెస్‌తో సమాధానం ఇచ్చారు. మంచి కథ పడితే.. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య రచ్చ ఏ విధంగా ఉంటుందో ‘అఖండ’తో మరోసారి ప్రూవ్ అయింది. ‘అఖండ’ సక్సెస్‌తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా 20థియేటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకుని ఈ డిజిటల్ యుగంలో వంద రోజుల పోస్టర్‌తో సంచలనం రేపింది. పెద్ద సినిమాలు రిలీజైతే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా రారా అన్న అనుమానాలు ‘అఖండ’ మాస్ జాతరతో పటా పంచలైపోయాయి.
ఆ సంగతి పక్కన పెడితే.. ‘అఖండ’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా పేర్కొంది. మొత్తంగా రూ. 95 కోట్ల షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ‘అఖండ’ మూవీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. అక్కడ కూడా ఎక్కువ మంది చూసిన సినిమా ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
‘అఖండ’ సక్సెస్ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభమైంది అక్కడ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైయింది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా సిరిసిల్లలో ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభమైంది. ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో దునియా విజయ్.. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు.
దానికి సంబంధించిన లుక్‌ను కూడా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్ ఉందట. ఈ పాటను డింపుల్ హయతీ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలుగుల ‘గద్దలకొండ గణేష్’లో ఓ ఐటెం సాంగ్‌లో మెరిసింది. ఆ తర్వాత రవితేజ ‘ఖిలాడి’ మూవీలో కథానాయికగా నటించింది. తాజాగా ఇపుడు బాలయ్యతో ఐటెం సాంగ్ చేయబోతుంది. ఇది ఈ సినిమాకే హైలెట్ అని చెబుతున్నారు.
ఈ సినిమాలో మరో లేడీ పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇక క్రాక్‌లో కథానాయికగా నటించిన శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది.ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్‌లో బ్లాక్ లుంగీలో పక్కన పెద్ద బండి పక్కన ఎంతో మాస్‌గా ఉంది. ఈ సినిమాకు ‘పెద్దాయన,’ తో పాటు అన్నగారు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇందులో ఏది కన్ఫామ్ చేస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Dimple hayathi, Gopichand malineni, NBK 107, Tollywood