హోమ్ /వార్తలు /సినిమా /

NBK 107 : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీపై అదిరిపోయే క్రేజీ అప్‌డేట్.. మొదలైన బాలయ్య వేట..

NBK 107 : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీపై అదిరిపోయే క్రేజీ అప్‌డేట్.. మొదలైన బాలయ్య వేట..

Balakrishna - Gopichanda Malineni : ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలంగాణలోని సిరిసిల్లలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్.

Balakrishna - Gopichanda Malineni : ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలంగాణలోని సిరిసిల్లలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్.

Balakrishna - Gopichanda Malineni : ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలంగాణలోని సిరిసిల్లలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్.

ఇంకా చదవండి ...

  NBK -107 - Balakrishna - Gopichanda Malineni : గతేడాది చివర్లో  బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ సక్సెస్‌తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా  దాదాపు 100 కు పైగా థియేటర్స్‌లో  50 రోజులు పూర్తి చేసుకుని సంచలనం రేపింది. పెద్ద సినిమాలు రిలీజైతే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా రారా అన్న అనుమానాలు ‘అఖండ’ మాస్ జాతరతో  పటా పంచలైపోయాయి.ఆ సంగతి పక్కన పెడితే.. ‘అఖండ’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల వరకు  గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా పేర్కొంది. మొత్తంగా రూ. 80 నుంచి రూ. 85  కోట్ల వరకు షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రీసెంట్‌గా ‘అఖండ’ మూవీ  హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఎక్కువ మంది చూసిన సినిమా ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

  ‘అఖండ’ సక్సెస్  తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది.ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ మూవీ ‘అఖండ’ షూటింగ్‌లో బాలయ్యకు గాయం కావడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం  ఆలస్యమైంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభమైంది.  ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో  కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.

  Bhumi Pednekar : మరోసారి రెచ్చిపోయిన భూమి పెడ్నేకర్.. సెగల్ రేపుతున్న లేటెస్ట్ పిక్స్..


  ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే  పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇక క్రాక్‌లో కథానాయికగా నటించిన శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 16 నుంచి జరగనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్‌లో బ్లాక్ లుంగీలో పక్కన పెద్ద బండి పక్కన ఎంతో మాస్‌గా ఉంది.

  ప్రస్తుతం బాలయ్య.. సినిమాలతో పాటు ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి సినిమా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ షోకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఆహాలో అత్యధిక వ్యూస్ తీసుకొస్తున్న షోగా ఇది రికార్డులు తిరగరాసింది. మన దేశంలో నంబర్ వన్ టాక్ షోగా నిలిచింది.  పైగా బాలయ్య హోస్టింగ్ కూడా కేక పెట్టిస్తుంది. తనను తాను చాలా మార్చుకున్నారు బాలయ్య. ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో సీజన్ 1  మహేష్ బాబు ఎపిసోడ్ ‌తో ఎండ్ కార్డ్ వేసారు. సెకండ్ సీజన్ ఎపుడు మొదలువుతుందో చూడాలి.

  Kajal Aggarwal Baby Shower : ఘనంగా కాజల్ అగర్వాల్ సీమంతం.. వైరల్ అవుతున్న పిక్స్..


  ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్, పోలీస్ ఆఫీసర్ పాత్రలు అని చెబుతున్నారు. మరోవైపు సాధువు పాత్రలో కూడా నటించబోతున్నట్టు కూడా చెబుతున్నారు. మొత్తంగా ‘చెన్నకేశవరెడ్డి’ తరహాలో తండ్రి కొడుకులు నేపథ్యంలో ఈ సినిమాను పలనాడు బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత ఘటలన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు వేట పాలెం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తాజాగా ‘పెద్దాయన’ టైటిల్ పరిశీలిస్తున్నారు.

  NBK 107 బాలయ్య లుక్ అదుర్స్ (Twitter/Photo)

  ఒక హీరో పట్నానికి చెందిన వ్యక్తి అయితే.. మరోకరు ఊరిలో ఉన్న ’పెద్దాయన’. మొత్తంగా ఈ టైటిల్ ఫిక్స్ అయితే.. అభిమానులకు అంత కన్నా ఆనందం ఉండదు. మొత్తంగా ఈ రెండు కూడా బాలయ్య ఇమేజ్‌కు తగ్గ సరైన టైటిల్స్ అంటున్నారు అభిమానులు.  ఈ సినిమా కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ‘మఫ్టీ’ మూవీకి రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. ఏమైనా చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదు.

  First published:

  Tags: Balakrishna, Gopichand malineni, NBK 107, Shruti haasan, Tollywood

  ఉత్తమ కథలు