Home /News /movies /

NBK 107 DUNIYA VIJYA PLAYS MUSALI MADUGU PRATAP REDDY IN BALAKRISHNA GOPICHAND MALINENI MOVIE TA

NBK 107 : బాలయ్య సినిమాలో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో దునియా విజయ్..

దునియా విజయ్

దునియా విజయ్

NBK -107 - Balakrishna - Gopichanda Malineni : ‘అఖండ’ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా తెలంగాణలోని సిరిసిల్లలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా నుంచి విలన్‌గా యాక్ట్ చేస్తోన్న దునియా విజయ్‌ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
    NBK -107 - Balakrishna - Gopichanda Malineni : గతేడాది చివర్లో  బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉండరు. బాలయ్య పనైపోయిందన్న వాళ్లకు ఈ సినిమా సక్సెస్‌తో సమాధానం ఇచ్చారు. మంచి కథ పడితే.. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య రచ్చ ఏ విధంగా ఉంటుందో ‘అఖండ’తో మరోసారి ప్రూవ్ అయింది.  ‘అఖండ’ సక్సెస్‌తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా  రీసెంట్‌గా 20థియేటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకుని ఈ డిజిటల్ యుగంలో వంద రోజుల పోస్టర్‌తో  సంచలనం రేపింది.  పెద్ద సినిమాలు రిలీజైతే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా రారా అన్న అనుమానాలు ‘అఖండ’ మాస్ జాతరతో  పటా పంచలైపోయాయి.

    ఆ సంగతి పక్కన పెడితే.. ‘అఖండ’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల వరకు  గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా పేర్కొంది. మొత్తంగా రూ. 95 కోట్ల షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ‘అఖండ’ మూవీ  హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఎక్కువ మంది చూసిన సినిమా ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

    Chiranjeevi - Salman Khan God Father : సల్మాన్‌ఖాన్‌కు చిరంజీవి గ్రాండ్ వెల్కమ్.. గాడ్ ఫాదర్ షూటింగ్‌లో సల్లూ భాయ్..

    ‘అఖండ’ సక్సెస్  తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది.ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ మూవీ ‘అఖండ’ షూటింగ్‌లో బాలయ్యకు గాయం కావడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం  ఆలస్యమైంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభమైంది.  ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో  కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో దునియా విజయ్.. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన లుక్‌ను కూడా విడుదల చేసారు. సిగరెట్ తాగుతూ ఉన్న దునియా విజయ్ లుక్ టెర్రిఫిక్‌గా ఉంది. బాలయ్యతో ఈ సీన్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి.

    NBK 107లో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో దునియా విజయ్ (Twitter/Photo)


    మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే  పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇక క్రాక్‌లో కథానాయికగా నటించిన శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది.

    RRR : ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్‌ను ఆపాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టేసినా తెలంగాణ హైకోర్టు..

    ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్‌లో బ్లాక్ లుంగీలో పక్కన పెద్ద బండి పక్కన ఎంతో మాస్‌గా ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Balakrishna, Duniya Vijay, NBK 107, Shruti haasan, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు