NBK 107 : బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ రోజు ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బాలకృష్ణ, శృతి హాసన్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ ఫస్ట్ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలతో పాటు హీరోయిన్ శృతి హాసన్, దర్శకులు బోయపాటి శ్రీను,వినాయక్, హరీష్ శంకర్, కొరటాల శివ, బాబీ, బీవీఎస్ రవి, బుచ్చిబాబు సన, సాయి మాధవ్ బుర్రా హాజరయ్యారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకటి పవర్ఫుల్ పోలీస్ పాత్ర అని చెబుతున్నారు. ‘చెన్నకేశవరెడ్డి’ తరహాలో తండ్రి కొడుకులు నేపథ్యంలో ఈ సినిమాను పలనాడు బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత ఘటలన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ‘జై బాలయ్య’ లేదా ‘వేట పాలెం’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఫైనల్‌గా ఈ సినిమాకు ‘వేట పాలెం’ అనే టైటిల్ ఖరారు చేసే అవకాశలున్నట్టు తెలుస్తోంది.
#NBK107 launched ❤️
The hunt begins very soon ?
▶️ https://t.co/fuzWYwCy6D#NBK107Begins ?
NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @MusicThaman ❤️
— Mythri Movie Makers (@MythriOfficial) November 13, 2021
ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో మరో పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ను తీసుకున్నారు. ఇంకో కథానాయికగా భావన నటిస్తున్నట్టు సమాచారం.
NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..
ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమ ా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వనున్నారు.
NBK 107 : అట్టహాసంగా ప్రారంభమైన బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ..
ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటించింది. మరోవైపు శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అఘోరాగా బాలయ్య గెటప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా బాలయ్య ‘అఖండ’ మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Gopichand malineni, Mythri Movie Makers, NBK 107, Shruti haasan, Tollywood