హోమ్ /వార్తలు /సినిమా /

NBK 107 : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్.. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యేది అపుడే..

NBK 107 : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్.. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యేది అపుడే..

Balakrishna - Gopichanda Malineni : ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి అంటే..

Balakrishna - Gopichanda Malineni : ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి అంటే..

Balakrishna - Gopichanda Malineni : ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి అంటే..

    NBK -107 - Balakrishna - Gopichanda Malineni : గతేడాది చివర్లో  బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ సక్సెస్‌తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా రీసెంట్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. పెద్ద సినిమాలు రిలీజైతే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా రారా అన్న అనుమానాలు ‘అఖండ’ మాస్ జాతరతో  పటా పంచలైపోయాయి.ఆ సంగతి పక్కన పెడితే.. ‘అఖండ’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల వరకు  గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. మొత్తంగా రూ. 80 కోట్ల వరకు షేర్ సాధించింది. రీసెంట్‌గా ‘అఖండ’ మూవీ  హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఎక్కువ మంది చూసిన సినిమా ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

    ‘అఖండ’ సక్సెస్  తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయ నున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది.ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ మూవీ ‘అఖండ’ షూటింగ్‌లో బాలయ్యకు గాయం కావడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం  ఆలస్యమైంది. ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో  కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.

    Tollywood Top Most Profitable Movies : బాహుబలి సహా తెలుగులో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు ఇవే..


    ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే  పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇక క్రాక్‌లో కథానాయికగా నటించిన శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 16 నుంచి జరగనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

    NBK 107 Balakrishna Shruti Haasan Gopichand Malineni Movie Pooja Ceremony Video Released By Mythri Movie Makers,NBK 107 : బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్..
    బాలకృష్ణ సరసన శృతిహాసన్, (Twitter/Photo)

    ప్రస్తుతం బాలయ్య.. సినిమాలతో పాటు ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి సినిమా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ షోకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఆహాలో అత్యధిక వ్యూస్ తీసుకొస్తున్న షోగా ఇది రికార్డులు తిరగరాస్తుంది. మన దేశంలో నంబర్ వన్ టాక్ షోగా నిలిచింది.  పైగా బాలయ్య హోస్టింగ్ కూడా కేక పెట్టిస్తుంది. తనను తాను చాలా మార్చుకున్నారు బాలయ్య. ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో సీజన్ 1  ఫిబ్రవరి 4న మహేష్ బాబు ఎపిసోడ్ ‌తో ఎండ్ కానుంది. సెకండ్ సీజన్ ఎపుడు మొదలువుతుందో చూడాలి.

    Akhanda - Pushpa : ‘అఖండ’, ‘పుష్ప’ సహా 2021లో నిర్మాతలకు ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు ఇవే..


    ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకటి పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర అని చెబుతున్నారు. ‘చెన్నకేశవరెడ్డి’ తరహాలో తండ్రి కొడుకులు నేపథ్యంలో ఈ సినిమాను పలనాడు బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత ఘటలన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు వేట పాలెం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తాజాగా ‘పెద్దాయన’ టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక బాలయ్య ఇమేజ్‌కు తగ్గ సరైన టైటిల్ అంటున్నారు అభిమానులు. ఒక హీరో పట్నానికి చెందిన వ్యక్తి అయితే.. మరోకరు ఊరిలో ఉన్న ’పెద్దాయన’. మొత్తంగా ఈ టైటిల్ ఫిక్స్ అయితే.. అభిమానులకు అంత కన్నా ఆనందం ఉండదు.

    First published:

    Tags: Akhanda movie, Balakrishna, Gopichand malineni, NBK 107

    ఉత్తమ కథలు