హోమ్ /వార్తలు /సినిమా /

NBK 107 : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్..

NBK 107 : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్..

Balakrishna - Gopichanda Malineni : గతేడాది చివర్లో  బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. తాజాగా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలుకుతూ.. NBK 107 యూనిట్ ఆహ్వానం పలికింది.

ఇంకా చదవండి ...

  Balakrishna - Gopichanda Malineni : గతేడాది చివర్లో  బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ సక్సెస్‌తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా విడుదలై 4 వారాలు పూర్తి చేసుకొని ఐదో వారంలో కూడా దుమ్ము దులుపుతోంది.  పెద్ద సినిమాలు రిలీజైతే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా రారా అన్న అనుమానాలు ‘అఖండ’ మాస్ జాతరతో  పటా పంచలైపోయాయి.ఆ సంగతి పక్కన పెడితే.. ‘అఖండ’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూకుడు మీదుంది. ఇక రూ. 71 కోట్ల షేర్‌తో ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది.‘అఖండ’ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది.

  ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ మూవీ ‘అఖండ’ షూటింగ్‌లో బాలయ్యకు గాయం కావడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం  ఆలస్యమైంది. ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో  కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ‌ఫుల్ పాత్ర ఉంది. ఈ పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్‌కుమార్‌కు మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.

  ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే  పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇక క్రాక్‌లో కథానాయికగా నటించిన శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది.

  NBK 107 Balakrishna Shruti Haasan Gopichand Malineni Movie Pooja Ceremony Video Released By Mythri Movie Makers,NBK 107 : బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్..
  బాలకృష్ణ సరసన శృతిహాసన్, (Twitter/Photo)

  ప్రస్తుతం బాలయ్య.. సినిమాలతో పాటు ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి సినిమా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ షోకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఆహాలో అత్యధిక వ్యూస్ తీసుకొస్తున్న షోగా ఇది రికార్డులు తిరగరాస్తుంది. పైగా బాలయ్య హోస్టింగ్ కూడా కేక పెట్టిస్తుంది. తనను తాను చాలా మార్చుకున్నారు బాలయ్య.

  Chiranjeevi Remakes: లూసీఫర్ కాకుండా చిరంజీవి తన కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

  ముఖ్యంగా తనకంటే  తనకంటే తక్కువ ఇమేజ్ ఉన్న నటులు వచ్చినపుడు కూడా ఎంతో బాగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా.. వాళ్లపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇక బాలయ్య  చేతికి గాయం మరో రెండు వారాల్లో పూర్తిగా తగ్గిన తర్వాత సంక్రాంతి తర్వాత జనవరి 20 నుంచి గోపీచంద్ మలినేని సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను కేవలం రెండు షెడ్యూల్లలో కంప్లీట్ చేయనున్నారట.

  NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

  ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకటి పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర అని చెబుతున్నారు. ‘చెన్నకేశవరెడ్డి’ తరహాలో తండ్రి కొడుకులు నేపథ్యంలో ఈ సినిమాను పలనాడు బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత ఘటలన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు వేట పాలెం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

  First published:

  Tags: Balakrishna, Duniya Vijay, Gopichand malineni, NBK 107, Tollywood, Varalaxmi Sarathkumar

  ఉత్తమ కథలు