Home /News /movies /

NBK 107 BALAKRISHNA NANDAMURI GOPICHAND MALINENI MOVIE STARTS WITH POOJA CEREMONY COCONUT BREAKING EVENT TA

NBK 107 : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం..

NBK 107 పూజా కార్యక్రమాలతో ప్రారంభం (Twitter/Photo)

NBK 107 పూజా కార్యక్రమాలతో ప్రారంభం (Twitter/Photo)

NBK 107 : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా కాసేపటి క్రితమే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

NBK 107 : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా కాసేపటి క్రితమే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తొలిసారి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్, శృతి హాసన్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలతో పాటు హీరోయిన్ శృతి హాసన్, దర్శకులు బోయపాటి శ్రీను,వినాయక్, హరీష్ శంకర్, కొరటాల శివ, బాబీ, బీవీఎస్ రవి, బుచ్చిబాబు సన, సాయి మాధవ్ బుర్రా హాజరయ్యారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకటి పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర అని చెబుతున్నారు. ‘చెన్నకేశవరెడ్డి’ తరహాలో తండ్రి కొడుకులు నేపథ్యంలో ఈ సినిమాను పలనాడు బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత ఘటలన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ను తీసుకున్నారు. ఇంకో కథానాయికగా భావన నటిస్తున్నట్టు సమాచారం.


బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్ మలినేని (Gopichand Malineni) సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారట. ఏ సినిమాకైనా టైటిల్ ఇంపార్టెంట్. పేరును బట్టి అది ఎలాంటి సినిమానో ప్రేక్షకులు కూడా ఒక అంచనాకు వస్తారు. ఇక నందమూరి అందగాడు నట సింహా బాలకృష్ణ సినిమా అంటేనే పవర్‌ఫుల్ టైటిల్ ఉండాల్సిందే.

NBK 107 పూజా కార్యక్రమాలతో ప్రారంభం (Twitter/Photo)


త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకు కూడా ఓ పవర్‌ఫుల్ టైటిల్ అనుకుంటున్నారు. ముందుగా ఈ సినిమాకు ‘రౌడీయిజం’ (Rowdyism) అనే టైటిల్‌ను పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ టైటిల్ పై జరుగుతున్న ప్రచారాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఖండించిన సంగతి తెలిసిందే కదా.

NBK 107 పూజా కార్యక్రమాలతో ప్రారంభం (Twitter/Photo)


మేమె సరైన సమయంలో టైటిల్ ఏంటో ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ పలువురు హీరోలతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ కోవలో బాలకృష్ణ సినిమా కోసం ‘జై బాలయ్య’ (Jai Balayya) అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. ఇక అభిమానులు కూడా జై బాలయ్య అంటూ తమ అభిమాన హీరోను ముద్దుగా పిలుస్తుంటారు. ఇపుడు అదే టైటిల్‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేస్తే.. ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్  కావడం పక్కా అని చెప్పొచ్చు. అంతేకాదు త్వరలో ఈ టైటిల్‌ను కూడా అఫీషియల్‌గా ప్రకటించనున్నట్టు సమాచారం.

NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమ ా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీనిపై ఈ త్వరలో క్లారిటీ రానుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటించింది. మరోవైపు శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అఘోరాగా బాలయ్య గెటప్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Akhanda movie, Balakrishna, Balayya, Gopichand malineni, Mythri Movie Makers, NBK, NBK 107, Shruti haasan

తదుపరి వార్తలు