హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna - Gopichanda Malineni : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాపై అదిరిపోయే క్రేజీ అప్‌డేట్..

Balakrishna - Gopichanda Malineni : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాపై అదిరిపోయే క్రేజీ అప్‌డేట్..

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ అప్‌డేట్ (Twitter/Photo)

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ అప్‌డేట్ (Twitter/Photo)

Balakrishna - Gopichanda Malineni : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాపై అదిరిపోయే క్రేజీ అప్‌డేట్..ప్పటికే బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Balakrishna - Gopichanda Malineni : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాపై అదిరిపోయే క్రేజీ అప్‌డేట్... ఇప్పటికే బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ సక్సెస్‌తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా విడుదలై రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలో అడుగు పెట్టింది.  పెద్ద సినిమాలు రిలీజైతే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా రారా అన్న అనుమానాలు ‘అఖండ’ మాస్ జాతరతో  పటా పంచలైపోయాయి. దీంతో వరుసగా బడా సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఇంతలోనే బాలయ్యకు ‘అఖండ’ షూటింగ్‌లో గాయం కావడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం  ఆలస్యమైంది.

ప్రస్తుతం బాలయ్య.. సినిమాలతో పాటు ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి సినిమా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ షోకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఆహాలో అత్యధిక వ్యూస్ తీసుకొస్తున్న షోగా ఇది రికార్డులు తిరగరాస్తుంది. పైగా బాలయ్య హోస్టింగ్ కూడా కేక పెట్టిస్తుంది. తనను తాను చాలా మార్చుకున్నారు బాలయ్య.

Sridevi - Tamannaah - Kajal : శ్రీదేవి, తమన్నా, కాజల్ సహా తండ్రి కొడుకుల సరసన నటించిన హీరోయిన్స్ ఇంకెరున్నాంటే..

తనకంటే తక్కువ ఇమేజ్ ఉన్న నటులు వచ్చినపుడు కూడా ఎంతో బాగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా.. వాళ్లపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో రాజమౌళి, కీరవాణిలతో ఐదో ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ఇక బాలయ్య  చేతికి గాయం మరో రెండు వారాల్లో పూర్తిగా తగ్గిన తర్వాత సంక్రాంతి తర్వాత జనవరి 20 నుంచి గోపీచంద్ మలినేని సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను కేవలం రెండు షెడ్యూల్లలో కంప్లీట్ చేయనున్నారట. ఈ సినిమా బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ఇంకో కథానాయికగా భావన నటిస్తున్నట్టు సమాచారం.

Balakrishna - Rajamouli : నాతో సినిమా ఎపుడు చేస్తావ్.. రాజమౌళికి బాలకృష్ణ సూటి ప్రశ్న.. అదిరిన జక్కన్న సమాధానం..

ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకటి పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర అని చెబుతున్నారు. ‘చెన్నకేశవరెడ్డి’ తరహాలో తండ్రి కొడుకులు నేపథ్యంలో ఈ సినిమాను పలనాడు బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత ఘటలన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ‘జై బాలయ్య’ లేదా ‘వేట పాలెం’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఫైనల్‌గా ఈ సినిమాకు ‘వేట పాలెం’ అనే టైటిల్ ఖరారు చేసే అవకాశలున్నట్టు తెలుస్తోంది.

First published:

Tags: Akhanda movie, Balakrishna, Balayya, Gopichand malineni, NBK 107, Tollywood

ఉత్తమ కథలు