హోమ్ /వార్తలు /సినిమా /

NBK 107 | Balakrishna : బాలయ్య, గోపీచంద్ సినిమాకు ఎవరు ఊహించని టైటిల్‌.. త్వరలో అధికారిక ప్రకటన..

NBK 107 | Balakrishna : బాలయ్య, గోపీచంద్ సినిమాకు ఎవరు ఊహించని టైటిల్‌.. త్వరలో అధికారిక ప్రకటన..

Balakrishna for NBK107 Photo : Twitter

Balakrishna for NBK107 Photo : Twitter

Balakrishna - Gopichanda Malineni : ‘అఖండ’ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తన తదుపరి సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.

గత ఏడాది నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన అఖండ (Akhanda) మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమా 20థియేటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకుని ఈ డిజిటల్ యుగంలో వంద రోజుల పోస్టర్‌తో  సంచలనం రేపింది.  పెద్ద సినిమాలు రిలీజైతే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా రారా అన్న అనుమానాలు ‘అఖండ’ మాస్ జాతరతో  పటా పంచలైపోయాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ‘అఖండ’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల వరకు  గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా పేర్కొంది. మొత్తంగా రూ. 95 కోట్ల షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ‘అఖండ’ మూవీ  హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.  అక్కడ కూడా ఎక్కువ మంది చూసిన సినిమా ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ‘అఖండ’ సక్సెస్  తర్వాత   (Balakrishna) బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichanda Malineni)తో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఖతర్నాక్ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అన్నగారు అనే పేరు పెట్టారని, త్వరలోనే అధికారికంగా కన్ఫర్మేషన్ రానుందని సమాచారం. ఇక ఈ సినిమాలో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కేక పెట్టిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ (Shruthi haasan) హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభమైంది అక్కడ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైయింది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా సిరిసిల్లలో ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభమైంది.  ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో  కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో దునియా విజయ్.. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన లుక్‌ను కూడా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే  పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు.

First published:

Tags: Balakrishna, Gopichand malineni, Shruthi haasan, Tollywood news

ఉత్తమ కథలు