Home /News /movies /

NBK 107 BALAKRISHNA ANOTHER CRAZY TITLE FOR BALAYYA GOPICHAND MALINENI HERE ARE THE DETAILS TA

NBK 107 - Balakrishna : బాలకృష్ణ,గోపీచంద్ మలినేని మూవీ కోసం మరో క్రేజీ టైటిల్..? ఇంతకీ బాలయ్య కోసం ఎన్ని పేర్లంటే..

బాలకృష్ణ 107 చిత్రానికి మరో క్రేజీ టైటిల్ పరిశీలన (Twitter/Photo)

బాలకృష్ణ 107 చిత్రానికి మరో క్రేజీ టైటిల్ పరిశీలన (Twitter/Photo)

NBK 107 - Balakrishna - Gopichan Malineni | అఖండ మూవీ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. ఈ నెల 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తాజాగా బాలయ్య కోసం మరో క్రేజీ టైటిల్‌ను ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    NBK -107 - Balakrishna - Gopichanda Malineni : గతేడాది చివర్లో  బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. బాలయ్య పనైపోయిందన్న వాళ్లకు ఈ సినిమా సక్సెస్‌తో సమాధానం ఇచ్చారు. మంచి కథ పడితే.. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య రచ్చ ఏ విధంగా ఉంటుందో ‘అఖండ’తో మరోసారి ప్రూవ్ అయింది.  ‘అఖండ’ సక్సెస్‌తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా 20థియేటర్స్‌లో 4 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుని ఈ డిజిటల్ యుగంలో వంద రోజుల పోస్టర్‌తో  సంచలనం రేపింది. అంతేకాదు రీసెంట్‌గా ఈ సినిమా గుంటూరులోని రామకృష్ణ థియేటర్‌లో 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. మొత్తంగా గత కొన్నేళ్లుగా ఓ హీరో నటించిన సినిమా వంద రోజులతో పాటు 175 రోజులు పూర్తి చేసుకోవడం అది బాలయ్య మాత్రమే సాధ్యమైంది.

    మొత్తంగా ఈ సినిమా ఓవరాట్‌గా ప్రపంచ వ్యాప్తంగా  రూ. 95 కోట్ల షేర్ (రూ. 200 కోట్ల గ్రాస్)  సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ‘అఖండ’ మూవీ  హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.  అక్కడ కూడా ఎక్కువ మంది చూసిన సినిమా ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.


    ‘అఖండ’ సక్సెస్  తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభమైంది అక్కడ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైయింది. రీసెంట్‌గా ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా సిరిసిల్లలో ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభమైంది.  ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో  కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో దునియా విజయ్.. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు.

    Roja - Nayanthara : రోజా పెళ్లికి నయనతార మ్యారేజ్‌కు ఉన్న ఈ లింకు తెలుసా..


    ఈ సినిమాలో లేడీ విలన్‌గా పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే  పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇక క్రాక్‌లో కథానాయికగా నటించిన శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది.ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

    Balakrishna Remakes: మంగమ్మ మనవడు టూ లక్ష్మీ నరసింహా వరకు బాలయ్య రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

    ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్‌లో బ్లాక్ లుంగీలో పక్కన పెద్ద బండి పక్కన ఎంతో మాస్‌గా ఉంది. ఈ సినిమాకు ‘పెద్దాయన,’ తో పాటు అన్నగారు, వేట పాలెం అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు ‘రెడ్డిగారు’ అనే మరో పేరు పరిశీలనకు వచ్చింది. మరి బాలయ్య సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారనేది బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Balakrishna, Gopichand, NBK 107, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు