టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో సినిమాను బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్‌లో అఫీఫియల్‌గా అనౌన్స్ చేసాడు. తన తండ్రితో తెరకెక్కించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ తర్వాత సినిమా నిర్మాణానికి దూరంగా ఉండాలని బాలకృష్ణ ఫిక్స్ అయినట్టు సమచారం. అందుకే బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్స్ నిర్మాణంలో చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు.
From the blockbuster combination of #Simha and #Legend, here comes the hat-trick combination #NandamuriBalakrishna and #BoyapatiSreenu to team up Shoot starts from Dec 2019, Release for late summer 2020#MiryalaRavinderReddy to produce under @DwarakaCreation pic.twitter.com/XTIfmTrNG1 — BARaju (@baraju_SuperHit) September 15, 2019
ఇక బాలకృష్ణతో నిర్మించే సినిమా కోసం బోయపాటి శ్రీను ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను మొదలు పెట్టాడు. ఈ సినిమా కంటే బోయపాటి శ్రీను..రామ్ చరణ్‌తో తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో బోయపాటి శ్రీను దర్శకత్వంపైనే అందరికీ అనుమానాలు వచ్చేలా చేసుకున్నాడు. ఈ సినిమా కొట్టిన దెబ్బకు ఈయన బాలయ్యతో సినిమా కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈలోపు బాలకృష్ణ కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య కొత్త లుక్‌లో ట్రెండీగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు ‘రూలర్’ లేదా ‘క్రాంతి’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు.
టాలీవుడ్‌లో బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వచ్చినా కూడా బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం.గత పదేళ్లలో బాలయ్యను బోయపాటి అర్థం చేసుకున్నంతగా మరో దర్శకుడు ఎవరూ అర్థం చేసుకోలేదు. ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రారంభించి.. 2020 సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాలో బాలకృష్ణ సరసన రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్‌పుత్ నటించనున్నట్టు సమాచారం. మొత్తానికి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ సినిమాతో వీళ్లిద్దరు హాట్రిక్ సక్సెస్ అందుకుంటారా లేదా వెయిట్ అండ్ సీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.