news18-telugu
Updated: October 27, 2019, 7:23 PM IST
Twitter
Nayanthara : నయనతార... తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి తెలుగువారికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగా.. నయన్.. తమిళ్లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తుంపును, ఓ స్థానాన్ని సంపాదించుకుంది. కాగా నయన్ ప్రస్తుతం తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ నిర్మాణంలోని ‘నెట్రికన్’ అనే తమిళచిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. నయన్ ఈ సినిమాలో కంటిచూపు సమస్య ఉన్న యువతి పాత్రలో నటిస్తోంది.
అది అలా ఉంటే.. నయన్ అందాన్ని పెంచుకోవడానికి తన స్వంత రాష్ట్రానికి వెళ్ళిందట. ఇటీవల నటించిన సినిమాల్లో నయనతార కొంత ఏజ్ ఉన్న అమ్మాయిగా.. పెద్దగా కనిపిస్తోందన్న వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే... అయితే దీని కోసం నయన్ జిమ్లో ఎంత కష్టపడినా, ఎంతగా డైటింగ్ చేసిన.. రావాల్సిన ఫలితం మాత్ర రావట్లేదట. అందుకే కేరళకు వెళ్ళి నయన్.. అక్కడి సహజ పద్ధతుల ద్వారా తన అందానికి మెరుగులు దిద్దుకోవాలనుకుందట. అందుకోసమే అక్కడికి వెళ్లిందని తమిళ సినీ ఇండస్ట్రీ వర్గాలు గుసగసలాడుతున్నాయి.
నయనతార అదిరిపోయే హాట్ పిక్స్..
Published by:
Suresh Rachamalla
First published:
October 27, 2019, 7:22 PM IST