Nayanthara : దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార దీక్ష చేపట్టింది. ముకుత్తి అమ్మన్ అనే ఆధ్యాత్మిక చిత్రంలో నటిస్తున్న ఆమె.. ఆ సినిమా కోసం నయనతార శాఖాహారిగా మారిందట.
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార దీక్ష చేపట్టింది. ముకుత్తి అమ్మన్ అనే ఆధ్యాత్మిక చిత్రంలో నటిస్తున్న ఆమె.. ఆ సినిమా కోసం నయనతార శాఖాహారిగా మారిందట. అమ్మవారి సినిమా కాబట్టి మాంసాహారం ముట్టుకోవద్దని నిర్ణయించుకుందట. అంతేకాదు.. ఒక పూట ఉపవాసం కూడా ఉండాలని తీర్మానించుకుందట. ఈ మేరకు సినిమా ప్రారంభం కానున్న నేపథ్యంలో తన బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌తో కలిసి కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి నుంచి మాంసం ముక్క ముట్టనని దీక్ష చేపట్టింది.
కన్యాకుమారి భగవతి అమ్మవారి ఆలయంలో నయనతార
కాగా.. శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నటించిన నయన్.. ఆ సినిమా అప్పుడు కూడా మాంసం ముద్ద ముట్టలేదట. ఏదేమైనా సినిమా కోసం కూడా ఆహారపు అలవాట్లు మార్చుకొన్న నయనతార అభిమానుల మనసు మరోసారి గెలుచుకుంది. ఇదిలా ఉండగా.. అన్నమయ్య, నమో వేంకటేశాయ సినిమాలు చేసేప్పుడు నాగార్జున సహా చిత్ర యూనిట్ మొత్తం చెప్పులు వేసుకోలేదట.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.