Home /News /movies /

NAYANTHARA VIGNESH SHIVAN VISITED TIRUMALA TIRUPATHI TEMPLE TODAY MORNING SPECIAL DHARISANAM TA

Nayanthara - Vignesh Shivan : ప్రియుడు విఘ్నేష్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార (Twitter/Photo)

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార (Twitter/Photo)

Nayanthara - Vignesh Shivan : ప్రియుడు విఘ్నేష్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నయనతార.

    Nayanthara - Vignesh Shivan : ప్రియుడు విఘ్నేష్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నయనతార.  గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు డేటింగ్‌లో ఉన్నారు. వీళ్లిద్దరు ఎక్కడికి వెళ్లినా.. కెమెరా కళ్లన్ని వాళ్లపైనే ఉంటాయి. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు  జంటగా కనిపించి అభిమానులను కనువిందు చేస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా జంటగానే దర్శనమిస్తున్నారు. వీళ్లిద్దరి పెళ్లికి సంబంధించి ముహూర్తం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి నయనతార సన్నిహిత వర్గాలు. వీళ్ల పెళ్లికి సంబంధించిన ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు సమాచారం. వీళ్ల పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొంత మందికి మాత్రమే ఆహ్వానం ఇప్పటికే అందినట్టు సమాచారం. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులను కూడా ప్రారంభమయినట్టు సమాచారం.

    అందులో భాగంగా వీళ్లిద్దరు కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్నట్టు సమాచారం. నయనతార పెళ్లి కోసం గద్వాల్ చీరతో పాటు కంచిపట్టును కూడా కొంత మంది డిజైనర్లు రెడీ చేసినట్టు సమాచారం. పెళ్లి మాత్రం తిరుమలలో జరిగే అవకాశాలున్నాయి. రిసెప్షన్ మాత్రం చెన్నైలో గ్రాండ్‌గా ఫైవ్ స్టార్ హోటల్‌లో ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి బాలయ్య, చిరంజీవి, సమంతలకు ప్రత్యేక ఆహ్వానం అందించేలా ప్లాన్ చేస్తున్నారు.

    Pawan Kalyan : ‘అత్తారింటికి దారేది’ కి 8 యేళ్లు పూర్తి.. పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ మ్యాజిక్..


    నయనతార, విఘ్నేష్ శివన్‌ విషయానికొస్తే..  గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూనే ఉన్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారం డేలీ ఎసిపోడ్‌ల బంకలా కొనసాగుతూనే ఉంది. ఇక విఘ్నేష్ శివన్ కంటే ముందు నయనతార, హీరో శింబుతో ప్రేమ వ్యవహారం నడిపించింది. ఆ తర్వాత ప్రభుదేవాతో లవ్వాయణం పెళ్లి పీఠలకు వరకు వెళ్లింది. చివరకు ఏమైందో ఏమో వీళ్ల పెళ్లికి చివరల్లో శుభం కార్డు మాత్రం పడలేదు. ఒకవేళ పడుంటే ఇపుడు విఘ్నేష్‌తో ప్రేమ వ్యవహారం ఉండేదే కాదు.

    Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

    కొన్నాళ్లుగా విఘ్నేష్‌తో నయనతారతో మధ్య పొసగడం లేదంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు వీళ్లిద్దరు విడిపోయినట్టు వార్తలు కూడా వచ్చాయి. రీసెంట్‌గా విఘ్నేష్ శివన్..నయనతార చేతి వేలికి ఉంగరం తొడిగారు. ఇక పెళ్లి మాత్రమే తరువాయి అంటున్నారు. విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కించిన ‘నానుమ్ రౌడీదాన్’ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది.

    Rajamouli@20 Years: దర్శకుడిగా 20 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న రాజమౌళి.. ఆకాశమే హద్దుగా జక్కన్న సినీ ప్రయాణం..

    ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ మొద‌లైంది. ఆ త‌రువాత వీరిద్ద‌రు క‌లిసి ప‌లు ఫంక్ష‌న్‌ల‌లో క‌నిపించ‌డంతో పాటు చెట్టా ప‌ట్టాలేసుకొని విదేశాలు తిరిగారు. ఆ ఫొటోల‌ను విఘ్నేష్ త‌రచుగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకునేవారు. ప్రస్తుతం నయనతార రజినీకాంత్ అన్నాత్తే  సినిమా కంప్లీట్ చేసింది. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Nayanthara, Tirumala, Tollywood, Vignesh Shivan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు