నయనతార పూజలు.. విఘ్నేష్ శివన్‌తో కలిసి దైవ దర్శనాలు..

నయనతార, విఘ్నేష్ శివన్.. ఈ జంట గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు వీళ్లు. ఇప్పుడు కూడా ఇదే చేసారు. వరసగా ఈ మధ్య దైవ దర్శనాలతో బిజీగా మారిపోయారు ఈ జోడీ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 19, 2019, 10:41 PM IST
నయనతార పూజలు.. విఘ్నేష్ శివన్‌తో కలిసి దైవ దర్శనాలు..
నిజాలు తెలుసుకోకుండా అలా రాయడం బాధ అనిపిస్తుందని చెప్పాడు విఘ్నేష్. ఇదిలా ఉంటే మీడియా తమ పెళ్లి ఇప్పటికే 20 సార్లకు పైగానే చేసి ఉంటుందని చమత్కరించాడు నయన్ లవర్.
  • Share this:
నయనతార, విఘ్నేష్ శివన్.. ఈ జంట గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు వీళ్లు. ఇప్పుడు కూడా ఇదే చేసారు. వరసగా ఈ మధ్య దైవ దర్శనాలతో బిజీగా మారిపోయారు ఈ జోడీ. ఈ మధ్య ఎక్కడ చూసినా.. ఏ గుళ్లో చూసినా కూడా నయన్, విఘ్నేష్ జంట కనిపిస్తుంది. మొన్నటికి మొన్న తమిళనాడు కాంచీపురంలోని స్వామి వారిని దర్శించుకున్నారు నయన్ జంట. ఆమె రాకతో ఆలయం అంతా సందడిగా మారిపోయింది. నయనతారకు ఎదురెళ్లి మరీ స్వాగతం పలికారు అక్కడి అధికారులు. ఆ తర్వాత తిరుమల వచ్చారు. ఇక ఇప్పుడు మరో గుళ్లో కూడా ఈ జంట దర్శనమిచ్చింది. వరసగా అన్ని గుళ్లకు తిరిగేస్తున్నారు నయన్, విఘ్నేష్.
Nayanthara Vignesh Shivan visited a temple in Tamil Nadu and photos going viral pk నయనతార, విఘ్నేష్ శివన్.. ఈ జంట గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు వీళ్లు. ఇప్పుడు కూడా ఇదే చేసారు. వరసగా ఈ మధ్య దైవ దర్శనాలతో బిజీగా మారిపోయారు ఈ జోడీ. nayanthara,nayanthara twitter,nayanthara instagram,nayanthara facebook,nayanthara vignesh shivan,nayanthara vignesh shivan special pooja,nayanthara vignesh shivan Athi Varadaraja Swamy temple Kanchipuram,nayanthara Athi Varadaraja Swamy temple Kanchipuram,nayanthara Athi Varadaraja Swamy temple,nayanthara Athi Varadaraja Swamy,athi varadaraja swamy temple kanchipuram,athi varadaraja swamy temple last date,athi varadaraja swamy temple darshan timings,athi varadaraja swamy temple live,athi varadaraja swamy temple address,athi varadaraja swamy temple rajinikanth,athi varadaraja swamy temple kcr,telugu cinema,అత్తి వరదరాజస్వామి,అత్తి వరదరాజస్వామి నయనతార,అత్తి వరదరాజస్వామి నయనతార విఘ్నేష్ శివన్,అత్తి వరదరాజస్వామి కేసీఆర్,అత్తి వరదరాజస్వామి రజినీకాంత్,తెలుగు సినిమా
తిరుమలలో విఘ్నేష్ శివన్, నయనతార

వేద పండితులు ఆమె పేరు మీద పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలు అందించారు. నయన్ గుళ్లో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ప్రియుడితో కలిసి రావడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరుగుతున్నా కూడా దానిపై మాత్రం నయనతార కానీ.. విఘ్నేష్ కానీ ఏం మాట్లాడటం లేదు. కానీ కొన్నేళ్లుగా సహజీవనం మాత్రం చేస్తున్నారు. ఇప్పటికీ పెళ్లి టాపిక్ మాత్రం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ వీళ్ళ గురించి కొత్తగా ఇప్పుడు చెప్పడానికి అయితే ఏం లేదు. దాచుకోడానికి ఏం లేదన్నట్లే తిరుగుతున్నారు నయన్, విఘ్నేష్ జంట.
Published by: Praveen Kumar Vadla
First published: December 19, 2019, 10:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading