Nayanthara Vignesh Shivan: గదిలో ఏకాంతంగా నయనతార, విఘ్నేష్ శివన్.. ఫోటోలు వైరల్..

నయనతార విఘ్నేష్ శివన్ (Nayanthara Vignesh Shivan)

Nayanthara Vignesh Shivan: నయనతార, విఘ్నేష్ శివన్.. ఈ జంట గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు వీళ్లు. ఇప్పుడు కూడా ఇదే చేసారు. వరసగా ఈ మధ్య దైవ దర్శనాలతో బిజీగా మారిపోయారు ఈ జోడీ. ఈ మధ్య ఎక్కడ చూసినా..

  • Share this:
నయనతార, విఘ్నేష్ శివన్.. ఈ జంట గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు వీళ్లు. ఇప్పుడు కూడా ఇదే చేసారు. వరసగా ఈ మధ్య దైవ దర్శనాలతో బిజీగా మారిపోయారు ఈ జోడీ. ఈ మధ్య ఎక్కడ చూసినా.. ఏ గుళ్లో చూసినా కూడా నయన్, విఘ్నేష్ జంట కనిపిస్తుంది. ఓవైపు గుళ్లు మాత్రమే కాదు మరోవైపు పార్టీలు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఈ జోడీ. ఎప్పటికప్పుడు వీళ్ల పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉంటాయి కానీ ఆ ముచ్చట మాత్రం జరగదు. మూడు ముళ్ల కోసం బాగానే వేచి చూస్తుంది నయన్. కానీ ఈమె జాతకంలో పెళ్లి యోగం లేదని కొందరు జ్యోతిష్కులు కుండ బద్ధలు కొట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే పెళ్లి కాకుండా సహజీవనం దగ్గరే నయన్ ఆగిపోయిందనే వాళ్లు కూడా లేకపోలేదు. ఏదేమైనా కూడా విఘ్నేష్‌తో మాత్రం ఎప్పుడూ కలిసే ఉంటుంది ఈ కేరళ కుట్టి. ఇప్పుడు కూడా కలిసే ఉన్నారు. తాజాగా ఈ ఇద్దరూ ఉన్న ఓ ఫోటో బయటికి వచ్చింది. ఓ గదిలో గాలి కూడా తమ మధ్యకు రాకూడదన్నట్లు హత్తుకుపోయారు. ఈ ప్రైవేట్ స్టిల్ బయటికి వచ్చింది. ఏ పండగ వచ్చినా కూడా ఇద్దరూ కలిసే సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ల ముందున్న అతిపెద్ద పండగ వాలెంటైన్స్ డే. ఫిబ్రవరి 14న రాబోయే ప్రేమికుల రోజును వారం ముందుగానే సెలబ్రేట్ చేసుకున్నారు ఈ జంట. ఈ క్రమంలోనే ఇద్దరూ ఏకాంతంగా ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే అక్కడ కూడా బిజీగానే ఉంది నయన్.
నయనతార విఘ్నేష్ శివన్ (Nayanthara Vignesh Shivan)

ప్రియుడి దర్శకత్వంలోనే ఈమె నటిస్తుందిప్పుడు. విజయ్ సేతుపతి, సమంత, నయనతార ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: