Nayanthara | Netrikann on Hotstar: హాట్ స్టార్‌లో నయనతార నెట్రికన్.. ఈరోజు నుంచే స్ట్రీమింగ్..

Nayanthara Netrikann Photo :Twitter

Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రం నెట్రికన్. కరోనా నేపథ్యంలో ఈ సినిమా హాట్ స్టార్‌లో డైరెక్ట్ రిలీజ్ అయ్యింది.

  • Share this:
    Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రం నెట్రికన్. కరోనా నేపథ్యంలో ఈ సినిమా హాట్ స్టార్‌లో డైరెక్ట్ రిలీజ్ అయ్యింది. ఆగస్టు 13న అంటే ఈరోజు నుంచి నెట్రికన్ అందుబాటులోకి వచ్చింది. నెట్రికన్‌లో నయనతార అంధురాలిగా కనిపించినుంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా నెటిజన్స్‌ను బాగానే ఆకర్షిస్తోంది. నెట్రికన్ సినిమాను విఘ్నేష్ శివన్ నిర్మించగా.. మిలింద్ రావ్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన నెట్రికన్ బ్లైండ్ అనే కొరియన్ సినిమాకు రీమేక్. ఇక నయనతార గతంలో కూడా ఇలాంటీ లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. తమిళ్‌లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి అదరగొట్టింది నయనతార. ఇక నెట్రికన్ విషయానికి వస్తే.. ఇది నయనతార నటిస్తున్న 65వ సినిమా. కంటి చూపు లేని యువతి తన వినికిడి శక్తిని ఉపయోగించి సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకుంది అనేదే కథ. ఇక నయనతార నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్ హీరోగా వస్తున్న అన్నాత్తేలో నటిస్తోంది. ఈ సినిమాకు శివ దర్శకుడు. తెలుగులో అన్నయ్యగా దీపావళికి విడుదలకానుంది.





    దీంతో పాటు కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలో నటిస్తుంది నయన్. సమంత ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా చేస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్నారు. ఈ సినిమాకు నయనతార ప్రియుడు, కాబోయే భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటు సినిమాల్లో నటిస్తూనే నయనతార తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించనుందని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి వెబ్ సిరీస్‌లో నయన్ కీలకపాత్రలో కనిపించనుంది టాక్.

    ఇవి కూడా చూడండి :

    Poorna : పూర్ణ పరువాల విందు.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

    RRR : అర్ధనగ్నంగా పోజులిచ్చిన ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ ఆలియా భట్.. పిక్స్ వైరల్..

    Anchor Varshini : బికినీలో యాంకర్ వర్షిణి.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

    Premi Viswanath : బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మెరిసిపోతున్న వంటలక్క...

    Anchor Vishnupriya : లోదుస్తుల్లో యాంకర్ విష్ణుప్రియ.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..
    Published by:Suresh Rachamalla
    First published: