హోమ్ /వార్తలు /సినిమా /

Nayanthara: ఏపీలోనే నయనతార, విఘ్నేష్ పెళ్లి.. ముహూర్తం ఫిక్స్.. మండపం ఇదే

Nayanthara: ఏపీలోనే నయనతార, విఘ్నేష్ పెళ్లి.. ముహూర్తం ఫిక్స్.. మండపం ఇదే

విఘ్నేష్, నయనతార

విఘ్నేష్, నయనతార

త్వరలోనే నయనతార పెళ్లి పీటలెక్కనుంది. వచ్చేనెలలోనే ఆమె తన ప్రియుడు, ప్రముఖ దర్శకుడు అయిన విఘ్నేశ్ శివన్‌ను వివాహం చేసుకోనుంది. దీంతో ఈ జంట ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా మారింది.

    ఎట్టకేలకు నయనతార తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నయన్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ టైం రానే వచ్చింది. నయన్ పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. నయనతార త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ను నయనతార త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఇటీవలే పర్యటించిన విఘ్నేశ్ నయన్.. శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ తిరుమలలో పెళ్లి వేదిక కోసం పరిశీలించారు. విఐబీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారిని దర్శించుకున్న జంట.. అనంతరం పెళ్లి కోసం.. వేదికను పరిశీలించినట్లు తెలిసింది. దీంతో వీరిద్దరు పెళ్లికి సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి. తిరుమలలో జూన్ 9న పెళ్లి చేసుకునేందుు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

    చంద్రముఖి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నయనతర... వరుసగా సినిమాలు చేసుకుంటూ.. స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది.  దర్శకుడు విగ్నేష్‌ శివన్‌-నయన తార ప్రస్తుతం లవ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. 5 సంవత్సరాలుగా… వీరు ప్రేమించుకుంటుండగా.. ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు వీరిద్దరి వివాహానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. కరోనా కారణంగా తమ పెళ్లి వాయిదా పడుతుంది అంటూ చెప్పుకొచ్చిన నయన్, విఘ్నేష్ లు.. సీక్రేట్ గా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు.

    రీసెంట్ గా పెళ్లి తేదీని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శిచుకున్న ఈ స్టార్ జంట.. ఆయన సన్నిధిలోనే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాట్లు సమాచారం. విఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న ఈజంట.. ఇక్కడే తిరుమలలో పెళ్ళి చేసుకోబోతున్నారట.  ఈరోజు దర్శంతో పాటు..తమ పెళ్ళికి వేదికను బుక్ చేసుకోవడం కోసం తిరుమలకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే నయన్ ఇప్పటికే రెండు సార్లు పెళ్లివరకు వెళ్లి వెనక్కి వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నయనతార.. తమిళ్ హీరో శింభు మధ్య లవ్ ఎఫైర్ నడిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ప్రభుదేవతో కూడా నయన్ రిలేషన్ షిప్ కొన్నాళ్లు నడిచింది. వీరిద్దరీ మధ్య కూడా మనస్పర్థలు రావడంతో విడిపోయారు. చివరకు విఘ్నేశ్‌‌తో ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన ఈ లేడీ సూపర్ స్టార్.. ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కుతోంది.

    Published by:Sultana Shaik
    First published:

    Tags: Nayanatara vignesh, Nayanthara, Nayanthara ​ Marriage, Tirumala, Tirumala Temple

    ఉత్తమ కథలు