Nayanthara- Vignesh Shivan Marriage Date Fix: నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లికి ముహూర్తం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి కోలీవుడ్ సినీ వర్గాలు. తాజాగా విఘ్నేష్ శివన్ .. నయనతారకు నిశ్చితార్ధపు ఉంగరం పెట్టాడు. దానికి సంబంధించిన ఫోటోను షేర్ చేసాడ. తాజాగా వీళ్లిద్దరి పెళ్లికి సంబంధించి ముహూర్తం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి నయనతార సన్నిహిత వర్గాలు. వీళ్ల పెళ్లికి సంబంధించిన ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం శుక్ర మూఢమి ఉండటంతో వీళ్ల పెళ్లి మే ఫస్ట్ వీక్ వీళ్ల జాతకాలను బట్టి మంచి ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. వీళ్ల పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొంత మందికి మాత్రమే ఆహ్వానం ఇప్పటికే అందినట్టు సమాచారం. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులను కూడా ప్రారంభమయ్యాయి.
నయనతార పెళ్లి కోసం గద్వాల్ చీరతో పాటు కంచిపట్టును కూడా కొంత మంది డిజైనర్లు రెడీ చేసినట్టు సమాచారం. పెళ్లి మాత్రం తిరుమలలో జరిగే అవకాశాలున్నాయి. రిసెప్షన్ మాత్రం చెన్నైలో గ్రాండ్‌గా ఫైవ్ స్టార్ హోటల్‌లో ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి బాలయ్య, చిరంజీవి, సమంతలకు ప్రత్యేక ఆహ్వానం అందినట్టు సమాచారం.
నయనతార, విఘ్నేష్ శివన్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూనే ఉన్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారం డేలీ ఎసిపోడ్‌ల బంకలా కొనసాగుతూనే ఉంది. ఇక విఘ్నేష్ శివన్ కంటే ముందు నయనతార, హీరో శింబుతో ప్రేమ వ్యవహారం నడిపించింది. ఆ తర్వాత ప్రభుదేవాతో లవ్వాయణం పెళ్లి పీఠలకు వరకు వెళ్లింది. చివరకు ఏమైందో ఏమో వీళ్ల పెళ్లికి చివరల్లో శుభం కార్డు మాత్రం పడలేదు. ఒకవేళ పడుంటే ఇపుడు విఘ్నేష్‌తో ప్రేమ వ్యవహారం ఉండేదే కాదు.కొన్నాళ్లుగా విఘ్నేష్‌తో నయనతారతో మధ్య పొసగడం లేదంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు వీళ్లిద్దరు విడిపోయినట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా విఘ్నేష్ శివన్..నయనతార చేతి వేలికి ఉంగరం తొడగాడు. ఇక పెళ్లి మాత్రమే తర్వాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.