Nayanthara : నయనతార... విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి తెలుగువారికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగా.. నయన్.. తమిళ్లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అది అలా ఉంటే నయనతార వ్యక్తిగత జీవితం గురించి ఏదో ఒకటి ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. నయన్ ప్రస్తుతం విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఓనమ్ పండగ సందర్భంగా తన ప్రియుడితో కలిసి కొచ్చిలో అడుగుపెట్టింది. కేరళీయుల ముఖ్య పండుగ ఓనమ్‌ను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు నయన్ చెన్నై నుండి చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ కొచ్చి వచ్చింది. ఈ సందర్భంగా ఫ్లైట్ దిగుతున్న కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో నయనతార స్టైలిష్ లుక్ లో కనిపిస్తోంది. ఇక ఏళ్లుగా నడుస్తూ ఉన్న ఈ వీరి ప్రేమ కథకు శుభం కార్డ్ పడనుంది. త్వరలోనే ఈ జోడీ వివాహం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
ప్రియుడితో నయనతార Photo : Twitter
ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నయన్ నెట్రికన్ అనే సినిమాతో పాటు రజనీకాంత్ శివ కాంబినేషన్లో వస్తోన్న అన్నాత్తేలోను మూకుత్తి అమ్మాన్ అనే మరో సినిమాలోను నటిస్తోంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.