హోమ్ /వార్తలు /సినిమా /

Nayanthara - Connect: యూవీ క్రియేషన్స్ ద్వారా ఈ నెల 22న నయనతార హారర్ థ్రిల్లర్ ‘కనెక్ట్’ రిలీజ్

Nayanthara - Connect: యూవీ క్రియేషన్స్ ద్వారా ఈ నెల 22న నయనతార హారర్ థ్రిల్లర్ ‘కనెక్ట్’ రిలీజ్

నయనతార ‘కనెక్ట్’ మూవీ (Twitter/Photo)

నయనతార ‘కనెక్ట్’ మూవీ (Twitter/Photo)

Nayanthara - Connect : నయనతార ఈమె నటించిన లేటెస్ట్ సినిమా ‘కనెక్ట్’.  ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Nayanthara - Connect : నయనతార ఈ మధ్యకాలంలో ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే.. లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తోంది. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తాజాగా ఈమె నటించిన సినిమా ‘కనెక్ట్’.  ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ స్పెషలిస్ట్. నయనతార నాయికగా ఆయన రూపొందించిన "మయూరి" సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది. అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన "గేమ్ ఓవర్" కూడా సూపర్ హిట్టయ్యింది. కనెక్ట్ చిత్రాన్ని కూడా ఆయన ఇంతే ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కనెక్ట్‌ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 22న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయి.

రీసెంట్‌గా నయనతార ‘గాడ్ ఫాదర్’ మూవీతో పలకరించింది. ఈ చిత్రంలో ఈమె చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. అంతకు ముందు ఈమె చిరు.. సరసన ‘సైరా.. నరసింహారెడ్డి’ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా నటించింది.

ఇప్పటి వరకు మలయాళం, తెలుగు, తమిళ,కన్నడ, చిత్రాల్లో నటించిన ఈమె సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో ఈమె హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతుంది. మరి దక్షిణాదిలో సత్తా చాటిన నయనతార .. ఇపుడు హీరోయిన్‌గా బీ టౌన్‌లో సత్తా చాటుతుందా అనేది చూడాలి.

మరోవైపు ఈమె నటించిన ‘కనెక్ట్’ చిత్రానికి యూవీ క్రియేషన్స్ తెలుగులో విడుదల చేస్తోంది.  ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో అనుపమ్‌ ఖేర్‌తోపాటు సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - పృథ్వి చంద్రశేఖర్‌, సినిమాటోగ్రఫీ - మణికంఠన్ కృష్ణమాచారి, ఎడిటింగ్ - రిచర్డ్ కెవిన్, పీఆర్వో - జీఎస్కే మీడియా.

First published:

Tags: Connect Movie, Nayanthara, Tollywood

ఉత్తమ కథలు