Nayanthara : ఆ విషయంలో తలపట్టుకుంటున్న నయనతార .. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఒకప్పుడు నయనతార అంటే గ్లామర్ హీరోయిన్. ఇప్పుడు దక్షిణాదిలో అందాల తారగానే కాకుండా లేడి హీరోయిన్‌గా పేరు తెచ్చుకొంది. తాజాగా ఈ భామ తన సినిమా రిజల్డ్ విషయంలో తల పట్టుకుంటోంది.

news18-telugu
Updated: August 6, 2019, 8:48 PM IST
Nayanthara : ఆ విషయంలో తలపట్టుకుంటున్న నయనతార .. ఇంతకీ ఏం జరిగిందంటే..
నయనతార (ఫైల్ ఫోటో)
  • Share this:
ఒకప్పుడు నయనతార అంటే గ్లామర్ హీరోయిన్. ఇప్పుడు దక్షిణాదిలో అందాల తారగానే కాకుండా లేడి హీరోయిన్‌గా పేరు తెచ్చుకొంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో హీరోయిన్ 30 ప్లస్ లోకి పడిందంటే ఇక ఆమె కథ ముగిసినట్లే అనుకుంటారు . కానీ నయనతార మాత్రం ఇందుకు భిన్నం. 30 ప్లస్ ఏళ్ల వయసులోనూ ఆమె జోరు మామూలుగా లేదు. వరుస హిట్లతో దూసుకెళ్లిపోతోంది ఈ మలయాళ కుట్టి. దాదాపు అరడజను క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. హీరోల్లాగా సినిమాను తన భుజాల మీద మోయగల సత్తా ఆమె సొంతం. అందుకే ఆమె ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా వరుసగా క్యూ కడుతున్నాయి. ఈ చిత్రాలకు ఆమె పారితోషకం కూడా భారీగానే  అందుకుంటోంది.  సౌత్ ఇండియలో మరే కథానాయికా అందుకోని రెమ్యూనరేషన్ మార్కును నయనతార అందుకుంటుందని సమాచారం.
ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో అవకాశాలు నయన్ తలుపు తడుతున్నాయి. అలాంటిది ప్రస్తుతం నయన్ కి వచ్చిన సమస్య అంతా సక్సెస్‌ రేట్ పడిపోవడమే. ఈ విషయంలో నయనతార టైమ్‌ అస్సలు బాగాలేదనే చెప్పాలి.

నయనతార (ఫైల్ ఫోటో)


నిజానికి ఈ సంచలన నటి సక్సెస్‌ను చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య అరమ్, కోలమావు కోకిల, ఇమైకా నొడిగళ్‌ వంటి చిత్రాలతో వరుసగా సక్సెస్‌లు అందుకున్న నయనతార ఆ తరువాత విజయాలకు దూరం అయ్యారు. ఇటీవల ‘ఐరా’, శివకార్తికేయన్‌తో నటించిన ‘మిస్టర్‌ లోకల్‌’ చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి.తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘కొలైయుధీర్‌ కాలం’ చిత్రం శిరోభారంగా మారిందని తమిళ ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. ఈ చిత్ర నిర్మాణంలోనే జాప్యం జరిగింది. ఎట్టకేలకు పూర్తి చేసుకుని ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వరకూ వచ్చిన ‘కొలైయుధీర్‌ కాలం’ చిత్రం ఆ వేడుకలో సీనియర్‌ నటుడు రాధారవి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.నయనతార నటించిన ‘కొలైయుతీర్ కాలమ్’ సినిమా చాలా రోజులుగా విడుదలకు నోచుకోవడం లేదు. ఇప్పటికే  పలుమార్లు ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 1వ తేదీన రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ఆగస్టు 1 తేదీన కూడా ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. ఐతే ఇలా రిలీజ్ వాయిదా పడటం ఇది ఏడోసారి. ఐతే రిలీజ్ వాయిదా వెనుక అసలు కారణాలు బయటకు రాకపోవడం మాత్రం సస్సెన్స్‌గా మారింది. ఇదంతా నటి నయనతారకు మనశ్శాంతిని కరువు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో చిరంజీవితో ‘సైరా నరిసింహారెడ్డి’తో పాటు తమిళంలో రజినీకాంత్‌తో ‘దర్బార్’ సినిమాలో నటిస్తోంది

First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు