Home /News /movies /

'సైరా' సినిమా యూనిట్‌కు చుక్కలు చూపించిన నయనతార..

'సైరా' సినిమా యూనిట్‌కు చుక్కలు చూపించిన నయనతార..

చిరంజీవి,నయనతార (ఫైల్ ఫోటో)

చిరంజీవి,నయనతార (ఫైల్ ఫోటో)

చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా..నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో  కొణిదెల ప్రొడక్షన్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఉయ్యాలవాడ వారుసులతో పాటు ‘సైరా’ చిత్ర యూనిట్‌కు హీరోయిన్ నయనతార కూడా చుక్కలు చూపించనట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి ...
    చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా..నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో  కొణిదెల ప్రొడక్షన్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీటవ్వడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో నటించారు. మరోవైపు నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో అనుష్క, తమన్నాఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయతలు పరుచూరి బ్రదర్స్ కథ సహకారం అందించారు. ఇప్పటికే ఈ సినిమా కథ విషయంలో ఉయ్యాలవాడ వారసులు.. రామ్ చరణ్ ఆఫీస్ ముందు ధర్నా చేసిన సంగతి తెలిసిందే కదా. ఉయ్యాలవాడ వారుసులతో పాటు ‘సైరా’ చిత్ర యూనిట్‌కు హీరోయిన్ నయనతార కూడా చుక్కలు చూపించనట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

    Happy Birthday south indian queeen Nayanthara.. న‌య‌న‌తార ఉందంటే సినిమా హిట్.. ఇక్క‌డ మ‌రో అనుమానం అవ‌స‌రం లేదు. అందుకే ప్రేక్ష‌కులు కూడా ఇప్పుడు న‌య‌న్ సినిమా అంటే ఎలా ఉంది అని అడ‌గడం మానేసారు. ఆమె ఓకే చేసిందా అయితే హిట్టేలే అంటున్నారు. ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ న‌య‌న‌తార కూడా వ‌ర‌స హిట్ల‌తో జోరుమీదుంది. నవంబర్ 18న నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా "సైరా" మోషన్ పోస్టర్ కూడా విడుదలైంది. happy birthday nayanthara,nayanthara birthday,nayanthara siddhamma,syeraa nayanthara,nayanthara vignesh shivan,నయనతార బర్త్ డే,నయనతార పుట్టినరోజు,నయనతార సైరా నరసింహారెడ్డి,నయనతార సిద్ధమ్మ,నయనతార చిరంజీవి,నయనతార తమిళ్ సినిమాలు,నయనతార నెంబర్ వన్ హీరోయిన్,నయనతార బర్త్ డే ఆర్టికల్
    నయనతార బర్త్ డే పోస్టర్స్


    చిరంజీవి తన కెరీర్‌లోనే తొలిసారి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాను చేస్తుండంతో ఖర్చు విషయంలో అసలు వెనకాడటం లేదు.  సాంకేతికంగా గ్రాఫిక్ సంబంధించిన విషయాల పై ఎలాంటి రాజీ పడకుండా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఈ చిత్రానికి భారీ గానే ఖర్చు చేసారు . ఇక నయనతారకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ చిత్రానికి ఒప్పించారు. ఇక నయన్ షూటింగ్ సమయంలో బసచేసేందుకు హోటల్, రవాణా ఖర్చులు మొత్తాన్ని చిత్ర యూనిటే  భరించిండదట. దీనితో సైరా చిత్రం కోసం నయనతార ఖర్చే తడిసి మోపెడైనట్లు తెలుస్తోంది. మొత్తంగా నయన్ ఖర్చు వల్ల నిర్మాతగా చరణ్ కు చుక్కలు కనిపించినట్లు ఇండస్ట్రీలో టాక్. మరోవైపు నయనతార లాంటి టాలెంటెట్ నటికి ఆ మాత్రం ఖర్చు పెద్ద లెక్కలోకి రాదంటున్నారు మరికొంతమంది.ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి కూడా డబ్బింగ్ పూర్తి చేసాడు. ఇక మిగిలిన పనులు కూడా వేగంగా పూర్తి చేసి అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 
    First published:

    Tags: Amitabh bachchan, Anushka Shetty, Chiranjeevi, Nayanthara, Ram Charan, Sudeep, Surender reddy, Syeraa Narasimha Reddy, Telugu Cinema, Thamannah, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు