Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తూ అదరగొడుతోన్న అందాల నటి. నయనతార ఇటూ హీరోయిన్గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది. అందులో భాగంగా.. నయన్.. తమిళ్లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక తాజాగా నయన్ మరో లేడి ఓరియెంటేడ్ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. షార్ట్ ఫిలిం మేకర్ నవకాంత్ రాజ్ కుమార్ చెప్పిన కథ విని, నచ్చడంతో ఆయన దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట నయన్. విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి తెలుగువారికి పరిచయమైన నయన్. ఆ తర్వాత వరుసగా తెలుగు టాప్ హీరోల సరసన నటించి అదరగొట్టింది. ఓ వైపు గ్లామర్ పాత్రలను పోషిస్తూనే.. పౌరానికాల్లోను నటిస్తూ అదరగొట్టింది నయన్. అందులో భాగంగా బాపు దర్శకత్వంలో, బాలయ్య సరసన 'శ్రీరామరాజ్యం'లో సీత పాత్ర చేసి.. అచ్చం సీత అంటే ఇలాగే ఉంటుందా? అనేలా యాక్ట్ చేసిందీ బ్యూటీ. ఆమె ఇటీవల అలాంటీ మరో సినిమాలో నటించింది. అదే ‘మూకుత్తి అమ్మన్’. ఈ సినిమాలో నయన్ అమ్మవారి గెటప్‌లో దర్శనమివ్వబోతుంది. ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌తో పాటు ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.
అయితే ఇంత వరకూ సినిమా థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో ఇక ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్దపడుతున్నారట చిత్ర దర్శక నిర్మాతలు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రం మే నెలలోనే విడుదల కావలసివున్నప్పటికీ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ ప్లేయర్ కు నిర్మాత ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అది అలా ఉంటే నయనతార ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో గత కొన్నేళ్లుగా నయనతార ప్రేమలో ఉంది. ఇటీవల ఈ జంట ఓనమ్ వేడుకల సందర్భంగా కలిసి తీయించుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రియుడుతో కలిసి తరచు విహార యాత్రలకు వెళ్తుంటుంది నయనతార. ఈ మధ్యే విఘ్నేష్‌శివన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ప్రేమికుల జంట గోవాకు వెళ్లారు. దాదాపు మూడురోజుల పాటు అక్కడే బస చేశారు. అయితే ఈ పుట్టినరోజు వేడుకలకు నయనతార 30లక్షల రూపాయల్ని ఖర్చుచేసిందట.. ఇది విని ముక్కున వేలుసుక్కున్నారు సినీ జనాలు. ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ఇటీవల తెలుగులో చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ నటించింది. నయనతార ప్రస్తుతం ‘నెట్రికన్’, ‘కాతువాకుల రెండు కాదల్’ వంటి తమిళ సినిమాల్లో నటిస్తోంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.