NAYANTHARA TO WORK WITH KAMAL HAASAN FOR GAUTHAM MENON HERE ARE THE DETAILS SR
కమల్‌తో నయన్.. సూపర్ హిట్ సినిమా సీక్వెల్లో లేడీ సూపర్ స్టార్..
ఇక నయనతార కూడా అంతే. ఈమె కూడా సినిమాకు 4 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. గతేడాది చిరంజీవి సైరా కోసం 7 కోట్ల వరకు నయనతారకు ఇచ్చారని తెలుస్తుంది.
కమల్ హాసన్, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో 2006లో విడుదలైన రాఘవన్‌కు 14 సంవత్సరాల తర్వాత సీక్వెల్ రూపొందనుంది.
Nayanthara : నయనతార... విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి తెలుగువారికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగా.. నయన్.. తమిళ్లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కాగా అప్పట్లో కమల్ హాసన్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘రాఘవన్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2006లో విడుదలై తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. కాగా దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క నటించబోతుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా సినీ వర్గాలు సమాచారం ప్రకారం లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ చిత్ర షూటింగ్లో ఉన్నాడు. అయితే కరోనా వల్ల వాయిదా పడింది. ఆ సినిమా పూర్తయ్యాక ‘రాఘవన్ -2’ చిత్రాన్ని పట్టాలెక్కించనుంది చిత్రబృందం.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.