Home /News /movies /

NAYANTHARA TO PAY THE LEADING LADY IN PREMAM DIRECTOR PAATTU MOVIE MHN

Nayanatara: ఐదేళ్ల‌ తర్వాత సినిమా చేస్తున్న సెన్సేషనల్‌ డైరెక్టర్‌.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నయనతార‌

నయనతార (File)

నయనతార (File)

Nayanatara - Premam Director: ‘ప్రేమమ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు అల్ఫెన్స్ పుత్రెన్ దర్శకత్వంలో నయనతార నటించనుంది.

    కొన్ని ప్రాంతీయ భాషా చిత్రాలు జాతీయ స్థాయిలో సెన్సేష‌న‌ల్ హిట్ అవుతాయి. వాటిని రీమేక్ చేసినా హిట్ అవుతుందా? అంటే స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితిలో ద‌ర్శ‌క నిర్మాత‌లుంటారు. అలా సెన్సేష‌న‌ల్ హిట్ అయిన ఓ మ‌ల‌యాళ చిత్రం ‘ప్రేమ‌మ్’. ఐదేళ్ల ముందు విడుద‌లైన ఈ సినిమాకు ప్రేక్ష‌కులు నీరాజ‌నం ప‌ట్టారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్ట‌ర్ అల్ఫెన్స్ పుత్రెన్ త‌ర్వాత మ‌రో సినిమాను డైరెక్ట్ చేయ‌లేదు. దాదాపు ఐదేళ్లు ఓ స్క్రిప్ట్‌ను త‌యారు చేసే ప‌నిలోనే ఉన్నాడు. ఎట్ట‌కేల‌కు ఆ స్క్రిప్ట్ ఫినిష్ అయ్యింది. అంతే కాదు.. ఆ సినిమాలో న‌టించ‌డానికి ప్ర‌ముఖ హీరోయిన్ న‌య‌న‌తార ఓకే చెప్పింది. ‘పాట్టు’ (పాట‌) పేరుతో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. మ‌ల‌యాళ స్టార్ ఫ‌హిద్ ఫాజిల్ ఈ చిత్రంలో మ‌రో లీడ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా కోసం డైరెక్ట‌ర్ సంగీతం కూడా అందిస్తున్నాడు. సంగీతం ప‌రంగా కాస్త రీసెర్చ్ చేసి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడ‌ట ఈ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా కూడా మ‌ల‌యాళంలోనే రూపొంద‌నుంది. అయితే ప్రేమమ్ వంటి భారీ హిట్ త‌ర్వాత ఈ సినిమాను ఇత‌ర భాష‌ల్లోనూ అనువాదం చేసి డ‌బ్ చేస్తారేమో చూడాలి.
    Published by:Anil
    First published:

    Tags: Malayala Cinema, Nayanathara, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు