Nayanthara Marriage : ఆ యువ దర్శకుడితో నయనతార పెళ్లి.. ముహూర్తం ఖరారు..

Nayanthara Photo : Twitter

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళ యువ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసింతే.. అందులో భాగంగా ఈ సెలెబ్రిటీ జంట గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని.. అంతేకాదు ఆ మధ్య ఈ జంట పెళ్లి కూడ చేసుకోబుతున్నట్లు ఓ వార్త తెగ హల్ చల్ చేసింది.

 • Share this:
  Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు. తన సినిమాలతో పాటు తన వ్యక్తిత్వంలో ఆమె తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. నయన్ తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. తమిళ్‌లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అది అలా ఉంటే సౌత్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్ కు లేని విధంగా నయనతార (Nayanthara ) వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. దీనికి ఆమె పాపులారిటీ ఒక కారణం అయితే.. మరో కారణం నయనతార ఏమి చేసినా ఓపెన్ గా చేసుకుంటూ పోతున్నారు.

  ఇక తాజాగా నిన్న తనకు కాబోయే భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్ పుట్టినరోజు సందర్భంగా నయన్ గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు. అంతేకాకుండా విఘ్నేష్ శివన్ కి అదిరిపోయే బర్త్ డే పార్టీ కూడా ఇచ్చారట నయనతార. విఘ్నేష్ బర్త్ డే సెలెబ్రేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

  Prabhas | Project K : ప్రభాస్ ప్రాజెక్ట్ కె నుంచి జబర్దస్త్ అప్ డేట్.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్..

  ఇక మరోవైపు నయనతార ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తమకు గతంలో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో వీరి పెళ్లిపై మరోసారి రూమర్స్ మొదలైయ్యాయి. ప్రస్తుతం విఘ్నేష్ శివన్  (Vignesh Shivan)తో పీకల్లోతు ప్రేమలో ఉన్న నయనతార తమ ప్రేమాయణానికి ముగింపు పలికి, దాంపత్య బంధానికి స్వాగతం పలకాలని ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుందని తాజా టాక్. అందులో భాగంగా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న కేరళలోని ప్రముఖ చర్చలో ఈ జంట వివాహం జరగబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..

  ఇక నయనతార నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటించిన నెట్రికన్ ఇటీవలే హాట్ స్టార్‌ విడుదలై (Netrikann on Hotstar)అదరగొట్టింది. ఈ చిత్రాన్ని ఆమె ప్రియుడు, కాబోయే భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ నిర్మించారు. 'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నయనతార అంధురాలి పాత్రలో కనిపించి తన నటనతో అదరగొట్టింది. కంటి చూపు లేని యువతి తన వినికిడి శక్తిని ఉపయోగించి సైకో కిల్లర్ ను ఎలా పట్టుకుంది అనేదే కథ. ‘గృహం’ చిత్ర దర్శకుడు మిలింద్ రావ్ ఈ సినిమాకు దర్శకుడు. కొరియన్ చిత్రం ‘బ్లైండ్’కు రీమేక్‌గా వచ్చింది.

  Anushka Shetty : చంద్రముఖి సీక్వెల్‌లో అనుష్క శెట్టి.. నవీన్‌ పొలిశెట్టి సినిమా ఆగినట్లేనా..

  నయనతార నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్ హీరోగా వస్తున్న అన్నాత్తేలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు శివ దర్శకుడు. తెలుగులో అన్నయ్యగా రిలీజ్ కానుంది. ఈ సినిమా దీపావళికి వస్తోంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్త చేసుకుంది. దీంతో పాటు కాతు వాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలో నటిస్తుంది.

  సమంత ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా చేస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకుడు. మరోవైపు నయన ఫస్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి వెబ్ సిరీస్‌లో నయన్ కీలకపాత్రలో కనిపించనుందని తాజా సమాచారం.
  Published by:Suresh Rachamalla
  First published: