Nayanthara | Vignesh Shivan : విఘ్నేష్ శివన్‌కు షాకిచ్చిన లేడీ సూపర్ స్టార్.. ఫిబ్రవరిలో పెద్దల సమక్షంలో నయనతార పెళ్లి..

కానీ ఈమె జాతకంలో పెళ్లి యోగం లేదని కొందరు జ్యోతిష్కులు కుండ బద్ధలు కొట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే పెళ్లి కాకుండా సహజీవనం దగ్గరే నయన్ ఆగిపోయిందనే వాళ్లు కూడా లేకపోలేదు. ఏదేమైనా కూడా విఘ్నేష్‌తో మాత్రం ఎప్పుడూ కలిసే ఉంటుంది ఈ కేరళ కుట్టి.

Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార ఫిబ్రవరిలో పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకోనుందని తెలుస్తోంది.

 • Share this:
  Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. సౌత్ ఇండియాలోని అన్ని భాషాల్లో నటిస్తూ లేడీ అదరగొడుతోన్న అందాల రాశి. నయనతార తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగా నయనతార తమిళ్‌లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తమిళ్‌లో నయనతార నటించిన దాదాపు అన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. నయన్ ప్రస్తుతం తమిళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తోంది. దీని పేరు 'నెట్రిక్కన్' (మూడో కన్ను). ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ నిర్మిస్తుండగా.. 'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార అంధురాలి పాత్రలో కనిపించనుంది. ఇది నయనతార నటిస్తున్న 65వ సినిమా.  ఈ నెట్రికన్‌ను తెలుగులో కూడా దీనిని రిలీజ్ చేయనున్నారు దర్శక నిర్మాతలు.

  అది అలా ఉంటే నయనతార, తమిళ యువ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌‌ను ప్రేమిస్తోన్న సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా వీరిద్దరు తమ ప్రణయబంధాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఇరువురు విదేశీ పర్యటనల సందర్భంగా ఈ జంట తీసుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక లాక్‌డౌన్‌ సమయంలో ఈ ప్రేమజంట వివాహ బంధంతో ఒకటి అవుతారని అన్నారు. కానీ అలా జరగలేదు. గత ఏడాదికాలంగా వీరిద్దరి పెళ్లి గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఈ జంట తమిళనాడులోని ఓ ప్రముఖ చర్చిలో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమ్మతితో వారి సమక్షంలో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు దాదాపు ఫిబ్రవరిలో వివాహం ఖాయమని చెబుతున్నారు నయనతార సన్నిహితులు. దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. ఇక్కడ మరో విశేషం ఏమంటే విఘ్నేష్ ఇంకొన్ని రోజులు తర్వాత పెళ్లి చేసుకుందాం అని అంటుంటే నయన్ మాత్రం తొందరపెడుతోందట. దీనికి కారణం లేకపోలేదు. విఘ్నేష్ ప్రస్తుతం ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.అది ముగించుకుని పెళ్లి చేసుకుందాం అని ప్రతిపాదన పెట్టాడట. కానీ దానికి నయనతార ఒప్పుకోలేదట. దీంతో వీరి పెళ్లి వచ్చేనెలలో జరగనుందని సమాచారం.


  ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా రూపొందుతోన్న తమిళ సినిమా “అన్నాత్తే” సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు శివ. ఈ సినిమాతో పాటు నయన్ మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. విజయ్ సేతుపతి, సమంత జంటగా వస్తోన్న ఓ తమిళ సినిమాలో నయనతార నటిస్తోంది. ఈ సినిమాను నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. వీటితో పాటు తెలుగులో కూడా నయనతార ఓ సినిమాలో నటించనుందని టాక్.

  సైరా తర్వాత చిరంజీవి హీరోగా వస్తోన్న లూసిఫర్‌లో నయనతార ఓ పాత్రలో కనిపించనుందని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సిఉంది. ఇక నయన్ నటించిన ‘మూకుత్తి అమ్మన్‌’ అనే సినిమా ఇటీవల హాట్ స్టార్‌లో విడుదలై పరవాలేదనిపించింది. ఈ సినిమాలో నయన్‌ అమ్మవారి గెటప్‌లో దర్శనమిచ్చి అదరగొట్టింది. ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో అమ్మోరు తల్లిగా విడుదలైన సంగతి తెలిసిందే.
  Published by:Suresh Rachamalla
  First published: