పెళ్లికి రెడీ అవుతున్న నయనతార... ముహూర్తం ఫిక్స్ ?

ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార (file Photo)

Nayanthara | నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

 • Share this:
  పెళ్లిపై నమ్మకం లేదో పెద్దల నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదో తెలియదు కానీ... తన ప్రియుడైన దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఏడడుగులు వేసే విషయాన్ని ఎటూ తేల్చడం లేదు నయనతార. ఎప్పటికప్పుడు ఈ క్రేజీ హీరోయిన్ పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే నయన్ మాత్రం ప్రియుడితో ఓ వైపు ఫారిన్ టూర్లకు వెళ్లడం, తన సినిమాలకు డేట్స్ ఇవ్వడం తప్పితే... తన పెళ్లి గురించి మాత్రం ఓ క్లారిటీ ఇవ్వడం లేదు.

  అయితే కోలీవుడ్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం... నయనతార పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. సినిమా కమిట్‌మెంట్స్ పూర్తికావడంతో పాటు ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో... డిసెంబర్‌లో నయనతార విఘ్నేష్ శివన్ పెళ్లి జరగబోతోందని తమిళ సినీ వర్గాల్లో ప్రచారం మొదలైంది.గతంలో రెండు సార్లు ప్రేమలో ఫెయిలైన నయనతార... ఈ సారి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే విషయంలో ఏ మాత్రం తొందరపడొద్దని భావించిందని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. ఈ కారణంగానే ప్రియుడు విఘ్నేష్‌ను పెళ్లి చేసుకునే విషయంలో నయన్ ఇంతకాలం వెయిట్ చేసిందని సమాచారం.

  ఇంతకాలం ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేకపోవడంతో పాటు తన అభిప్రాయానికి విఘ్నేష్ పూర్తి విలువను ఇస్తాడని నయన్ నిర్ణయానికి వచ్చిందని... అందుకే పెళ్లికి ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. డిసెంబర్‌లో వీరిద్దరి పెళ్లి జరగనుందని... అది కూడా విదేశాల్లో అని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. మరి... ప్రియుడితో నయన్ పెళ్లి పీటలు ఎక్కతుందా లేక మరికొంతకాలం సహజీవనానికే మొగ్గు చూపుతుందా అన్నది చూడాలి.
  Published by:Kishore Akkaladevi
  First published: