Nayanthara : రాజమౌళి బాహుబలిలో లేడీ సూపర్ స్టార్ నయనతార..

Nayanthara Photo : Twitter

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార మొదటిసారిగా ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

 • Share this:
  Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు. తన సినిమాలతో పాటు తన వ్యక్తిత్వంలో ఆమె తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. నయన్ తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అందులో భాగంగా.. నయన్.. తమిళ్‌లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక అది అలా ఉంటే నయన ఫస్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి వెబ్ సిరీస్‌లో నయన్ కీలకపాత్రలో కనిపించనుందని తాజా సామాచారం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి అమాంతం పెంచేసిన సినిమా ఇది. బాహుబలి ఇచ్చిన ధైర్యంతో అప్పటి నుంచీ మన స్టార్ హీరోలు నటించే తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా మారిపోయాయి.

  ఇక అది అలా ఉంటే 'బాహుబలి: బిఫోర్ ది బిగెనింగ్' పేరిట వస్తున్న వెబ్ సిరీస్‌‌కు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ వెబ్ సిరీస్‌కు రాజమౌళి రచన సహకారం అందిస్తున్నారు. తెలుగు దర్శకులు ప్రవీణ్ సత్తారు, దేవా కట్టా దర్శకత్వం వహించనున్నారు. ఇక నయనతార చేస్తోన్న పాత్రపై ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే శివగామి పాత్రలో హిందీ నటి వామికా గాబీ నటించనుంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం తొమ్మిది ఎపిసోడ్లుగా రూపొందుతుందని తెలుస్తోంది.

  ఇక నయనతార నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. తమిళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తోంది నయన్. దీని పేరు 'నెట్రిక్కన్' (తెలుగులో మూడో కన్ను). ఈ చిత్రాన్ని ఆమె ప్రియుడు, కాబోయే భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ నిర్మిస్తుండగా.. 'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవ్వగా.. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారట. దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సిఉంది. కొరియన్ చిత్రం ‘బ్లైండ్’కు రీమేక్‌గా వస్తోంది.

  ఇక ప్రస్తుతం నయనతార రజనీకాంత్ హీరోగా వస్తున్న అన్నాత్తేలో నటిస్తోంది. ఈ సినిమాకు శివ దర్శకుడు. తెలుగులో అన్నయ్యగా రిలీజ్ కానుంది. ఈ సినిమా దీపావళికి వస్తోంది. దీంతో పాటు కాతు వాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలో నటిస్తుంది. సమంత ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా చేస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకుడు.
  Published by:Suresh Rachamalla
  First published: