పవన్‌తో నయన్... కాంబినేషన్ అదిరెన్..

హిందీ, తమిళ భాషాల్లో సూపర్ హిట్టైన పింక్ సినిమాను తెలుగులో కూడా నిర్మించనున్నారు. ఈ తెలుగు రీమేక్‌లో  పవన్ కళ్యాణ్ నటిస్తారని తెలుస్తోంది.

news18-telugu
Updated: November 4, 2019, 11:58 AM IST
పవన్‌తో నయన్... కాంబినేషన్ అదిరెన్..
Twitter
  • Share this:
పింక్ సినిమా హిందీలో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అద్బుత నటనతో ఓ లాయర్‌గా అదరగొట్టాడు. కాగ ఇదే సినిమాను తమిళ్‌లో అజిత్ కూడా అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమాను తెలుగులో కూడా నిర్మించనున్నారు. ఈ తెలుగు రీమేక్‌లో  పవన్ కళ్యాణ్ నటిస్తారని తెలుస్తోంది. తెలుగు పింక్‌ను బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈయన గతంలో ఓ మై ఫ్రెండ్, ఎం సి ఏ వంటి చిత్రాలు తెరకెక్కించారు. అది అలా ఉంటే ఈ సినిమాలో పవన్ సరసన ఏ హీరోయిన్ నటించనుందో అని తెగ చర్చించుకుంటున్నారు అభిమానులు. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు లేడి సూపర్ స్టార్ నయనతారను ఈ చిత్రంలో పవన్ సరసన నటింప చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.


నయన్, పవన్ గతంలో కలిసి నటించక పోవడంతో ఈ జంట కలిసి నటిస్తే.. ఫ్రెష్ గా ఉంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. అయితే ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ సినిమా గురించి  పూర్తి వివరాలు తెలియాల్సీ ఉంది.

HBD Tabu : అందాల టబు అదిరిపోయే ఫోటోస్...

Published by: Suresh Rachamalla
First published: November 4, 2019, 11:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading