news18-telugu
Updated: October 15, 2019, 7:27 AM IST
Samantha Akkineni : సమంత.. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్లో ఒకరుగా రాణిస్తున్నారు. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ ఇటీవల చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. ఈ యేడాది మొదట్లో తన భర్త నాగ చైతన్యతో కలిసి చేసిన ‘మజిలీ’ సినిమా, ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో సమంత, శర్వానంద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అది అలా ఉంటే.. సమంత బాటలో నయనతార పయనిస్తోంది. వివరాల్లోకి వెళితే.. సమంత ఇటీవల ఓ కొరియన్ సినిమా రీమేక్‌తో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. కొరియన్ భాషలో 'మిస్ గ్రానీ' వచ్చిన ఆ సినిమాను తెలుగులో 'ఓ బేబి' పేరుతో రీమేక్ చేశారు. సమంత ప్రధాన పాత్రలో నటించింది. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఆ మధ్య 'యూట'ర్న్ అంటూ లేడీ ఓరియంటెడ్ సినిమా చేసిన సమంతకు కలిసిరాలేదు. కానీ ఈ 'ఓ బేబి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సోలోగా చేసి తన కెరీర్లో పెద్ద హిట్‌ను తన బుట్టలో వేసుకుంది సమంత.
ఇప్పుడు అదే బాటలో లేడీ సూపర్ స్టార్ నయనతార నడుస్తోంది. నయన్ కూడా ఓ కొరియన్ కథలో నటించడానికి అంగీకరించారని సమాచారం. కొరియన్ భాషలో హిట్టైనా ఓ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్‌పై హీరో రానా నిర్మించనున్నారు. ఈ రీమేక్‌లో నయనతార పోలీస్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర బృందం.
Published by:
Suresh Rachamalla
First published:
October 15, 2019, 7:27 AM IST