• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NAYANTHARA THROWS A LAVISH BIRTHDAY BASH FOR BOYFRIEND VIGNESH SHIVAN SR

Nayanthara : మూడు రోజులకు ముప్పై లక్షలు.. ముక్కున వేలేసుకుంటున్న జనాలు..

Nayanthara : మూడు రోజులకు ముప్పై లక్షలు.. ముక్కున వేలేసుకుంటున్న జనాలు..

నయనతార Photo : Twitter

Nayanthara : నయనతార... విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి తెలుగువారికి పరిచయం అయ్యింది.

  • Share this:
    Nayanthara : నయనతార... విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి తెలుగువారికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగా.. నయన్.. తమిళ్‌లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అది అలా ఉంటే నయనతార ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు విఘ్నేష్‌శివన్‌‌తో గత కొన్నేళ్లుగా నయనతార ప్రేమలో ఉంది. ఇటీవల ఈ జంట ఓనమ్‌ వేడుకల సందర్భంగా కలిసి తీయించుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రియుడుతో కలిసి తరచు విహార యాత్రలకు వెళ్తుంటుంది నయనతార. ఈ మధ్యే విఘ్నేష్‌శివన్‌ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ప్రేమికుల జంట గోవాకు వెళ్లారు. దాదాపు మూడురోజుల పాటు అక్కడే బస చేశారు. అయితే ఈ పుట్టినరోజు వేడుకలకు నయనతార 30లక్షల రూపాయల్ని ఖర్చుచేసిందని తెలిసింది. కేవలం మూడురోజుల విహారం కోసం ఈ స్థాయిలో విలాసంగా ఖర్చుపెట్టడం చాలా అరుదని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు..

    నయన్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల తెలుగులో చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ నటించింది. నయనతార ప్రస్తుతం ‘నెట్రికన్‌’, ‘కాతువాకుల రెండు కాదల్‌’ వంటి తమిళ సినిమాల్లో నటిస్తోంది. కాగా ఆమె ఆ మధ్య నటించిన సినిమా ‘మూకుత్తి అమ్మన్‌’. ఈ సినిమాలో నయన్ అమ్మవారి రూపంలో దర్శనమివ్వబోతోంది. ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో సమ్మర్‌లో విడుదలకావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే ఇంత వరకూ సినిమా థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో ఇక ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్దపడుతున్నారట చిత్ర దర్శక నిర్మాతలు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రం మే నెలలోనే విడుదల కావలసివున్నప్పటికీ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ ప్లేయర్ కు నిర్మాత ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
    Published by:Suresh Rachamalla
    First published: