అవును.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రామ్ చరణ్ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ,తమిళ్,కన్నడ,మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కాబోతున్న తొలి తెలుగు సినిమాగా ‘సైరా నరసింహారెడ్డి’ రికార్డులకు ఎక్కింది. ‘సాహో ’ సినిమా విషయానికొస్తే..ఈ సినిమాను కన్నడ తప్పించి మిగిలిన నాలుగు భాషల్లో విడుదల చేసారు. ‘సైరా నరసింహారెడ్డి’ విషయానికొస్తే.. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో నటించారు.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా నయనతార నటించింది.ఈ సినిమాలో నటించేందకు నయనతారకు భారీ పారితోషకం ముట్టజెప్పినట్టు సమాచారం. ఈ సినిమాలో నటించేందుకు నయనతారకు అక్షరాల రూ.6 కోట్లు పారితోషకం ఇచ్చినట్టు సమాచారం. నయనతార విషయానికొస్తే.. దక్షిణాదిలో అన్ని భాషల్లో ఆమెకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఆమె కోరినంత పారితోషకం ఇచ్చి ఆమెను ‘సైరా’ సినిమాలో తీసుకున్నట్టు సమాచారం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.