హోమ్ /వార్తలు /సినిమా /

Nayanthara Sindoor on forehead: నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లైపోయిందా.. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి..?

Nayanthara Sindoor on forehead: నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లైపోయిందా.. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి..?

Nayanthara Sindoor on forehead: ఏమో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇన్నాళ్ళూ కుమారిగానే ఉన్న న‌య‌న‌తార.. ఇప్పుడు మాత్రం శ్రీమతి అయిపోయింది. ఇన్ని రోజులు దీనిపై అనుమానాలు ఉండేవి కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా  పోయింది.

ఇంకా చదవండి ...

ఏమో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇన్నాళ్ళూ కుమారిగానే ఉన్న న‌య‌న‌తార (Nayanthara).. ఇప్పుడు మాత్రం శ్రీమతి అయిపోయింది. ఇన్ని రోజులు దీనిపై అనుమానాలు ఉండేవి కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఈమెకు పెళ్లైపోయింద‌ని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియుడు విఘ్నేష్ శివ‌న్‌నే (Vignesh Shivan) ఆమె ర‌హ‌స్యంగా వివాహం చేసుకుంద‌ని తెలిసిపోతుంది. విఘ్నేష్ త‌న‌కు స్నేహితుడు మాత్ర‌మే అని మొదట్లో కవర్ చేసినా.. ఆ తర్వాత తామిద్దరూ రిలేషన్‌లో ఉన్నామని చెప్పారు. పెళ్లి గురించి కూడా కొన్నిసార్లు మనసులో మాట బయటపెట్టారు. లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరూ ఒక్కటైపోయారని తెలుస్తుంది. తమిళనాడులోని ఓ గుడికి జంటగా వచ్చిన ఈ ఇద్దర్ని చూసి ఫిదా అయిపోయారు అభిమానులు.

మరీ ముఖ్యంగా నయనతార అయితే కొత్తగా కనిపించింది. నుదుటపై కుంకుమతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. పైగా ఈ ఫోటోల‌ను విడుద‌ల చేసింది కూడా ఎవ‌రో కాదు.. స్వ‌యంగా నయనతార. ఇద్ద‌రూ క‌లిసి ఓ గుడికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని వచ్చారు. ఆ సమయంలోనే నుదుటపై సింధూరం పెట్టుకుని కనిపించింది నయన్. కేవలం పెళ్లైన వాళ్లు మాత్రమే అలా పెడతారు. ఇప్పుడు నయన్ పెట్టిందంటే పెళ్లైపోయిందని అర్థం. అక్కడ వచ్చిన అభిమానులను అందరినీ నవ్వుతూ పలకరించింది నయన్. మరోవైపు విఘ్నేష్ మాత్రం నయన్ పట్ల చాలా ప్రొటెక్టివ్‌గా ఉన్నాడు. ఆమెకు సెక్యూరిటీ అయిపోయాడు. గుడి లోపలికి వచ్చినప్పటి నుంచి బయటికి వెళ్లేవరకు అంటి పెట్టుకుని ఉన్నాడు. నయన్, విఘ్నేష్ పెళ్లి చేసుకుంటారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు రహస్యంగా చేసుకున్నారని అర్థమవుతుంది.

అయితే ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పకుండా చెప్పాలనుకుంది నయనతార. అనుకున్నట్లుగానే ఇప్పుడు ఈ దంపతులు గుడికి వచ్చారు. ఆ మధ్య అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ వెళ్లినపుడు కూడా ఇలాగే కనిపించారు నయన్ జంట. అక్క‌డే దేవున్ని ద‌ర్శించి భార్యాభ‌ర్త‌లు ఆ గుళ్లో చేసే ప్ర‌తీ ప‌ని క‌లిసి చేసారు. దాన్ని బ‌ట్టి ఏం అర్థం చేసుకోవాలి..? పైగా విఘ్నేష్ కూడా ఇప్పుడు న‌య‌న్‌ను త‌న లైఫ్ అంటున్నాడు. రెగ్యులర్‌గా కలిసే పండగలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ మధ్య అత్తివరదరాజ స్వామి గుడిని కూడా కలిసే దర్శించుకున్నారు. ఇంతకంటే ఏం సాక్ష్యాలు కావాలి ఈ ఇద్దరూ భార్యాభర్తలు అవునని చెప్పడానికి. వీటన్నింటి కంటే కూడా తాజాగా నుదుటపై కుంకుమ పెట్టుకుని కనిపించిన నయనతారను చూసి.. ఇకపై కుమారి కాదు ఈమె శ్రీమతి అని ఫిక్స్ అయిపోయారు.

First published:

Tags: Nayanthara, Nayanthara ​ Marriage, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు