ప్రస్తుతం తన 152వ చిత్రం ఆచార్య చిత్రీకరణలో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తదుపరి రెండు సినిమాలను ట్రాక్ ఎక్కించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అందులోముందుగా మలయాళ రీమేక్ 'లూసిఫర్'ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటిస్తాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రీమేక్‌కు సంబంధించిన వార్తొకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో నయనతార నటిస్తుంది. దక్షిణాదిన హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌గా పేరున్న నయనతార.. లూసిఫర్ రీమేక్‌లో ముఖ్యమంత్రి కుమార్తె పాత్రలో నటించనుందని టాక్ వినిపిస్తోంది. అంటే మలయాళంలో మంజు వారియర్ చేసిన పాత్ర. అంటే హీరో సోదరి పాత్ర. అంటే తెలుగు విషయానికి వస్తే చిరంజీవి సోదరి పాత్ర. ప్రస్తుతం మేకర్స్ ఆమెతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.
అయితే ఈ విషయం కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు ఇది కాస్త షాకింగ్ న్యూసే అవుతుంది. ఎందుకంటే చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిలో నయనతార .. చిరంజీవి జోడీగా నటించింది. మరిప్పుడు చెల్లెలు పాత్రలో కనిపిస్తే .. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? అనేది దర్శక నిర్మాతలు ఆలోచించాల్సిన విషయం. మరి నయనతార ఈ విషయం గురించి ఆలోచించి ఓకే చెబుతుందా ? లేక రెమ్యునరేషన్ ఇస్తే చాలు అని ఓకే చెబుతుందా? అని చూడాలి. తమిళ దర్శకుడు మోహన్‌రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తెలుగు నెటివిటీకి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు బైరెడ్డి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
లూసిఫర్ రీమేక్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేశ్ దర్శకత్వంలో తమిళ చిత్రం వేదాళం రీమేక్‌లో నటించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చిరంజీవి లుక్ టెస్ట్ కూడా చేసుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి ఇందులో గుండులో కనపడబోతున్నారనేది తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Megastar, Nayanatara, Sye raa narasimhareddy