సైరా కోసం నయనతార సంచలన నిర్ణయం.. చిరంజీవి మాయ..

నయనతార అంటే లేడీ బాస్.. లేడీ సూపర్ స్టార్.. ఆమెకు నచ్చింది తప్ప మరోటి చేయదు. అక్కడ ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా కూడా తన మనసులో ఏది అనిపిస్తే అది చెప్పే తెగింపు ఈ ముద్దుగుమ్మలో ఉంటుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 18, 2019, 10:59 PM IST
సైరా కోసం నయనతార సంచలన నిర్ణయం.. చిరంజీవి మాయ..
నయనతార (Twitter/Photo)
  • Share this:
నయనతార అంటే లేడీ బాస్.. లేడీ సూపర్ స్టార్.. ఆమెకు నచ్చింది తప్ప మరోటి చేయదు. అక్కడ ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా కూడా తన మనసులో ఏది అనిపిస్తే అది చెప్పే తెగింపు ఈ ముద్దుగుమ్మలో ఉంటుంది. ముఖ్యంగా సినిమాలు చేసినా కూడా చేసిన సినిమాలకు ప్రమోషన్ కూడా చేయదు ఈ భామ. ముందే నిర్మాతలకు తాను ప్రమోషన్‌కు రానని చెప్పేస్తుంది నయన్. బాలీవుడ్ హీరోయిన్లు కూడా ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంటారు. కానీ నయనతార మాత్రం దానికి విరుద్ధం. అసలు తను ప్రమోషన్ చేయనని మొహం మీదే చెప్పేస్తుంది.

Lady Super Star Nayanthara insults Megastar Chiranjeevi and She is not coming for Sye Raa Narasimha Reddy promotions pk ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల తీరు ఎప్పటికీ మారదు. వాళ్లు ఎన్ని సినిమాలు చేసినా కూడా వర్కింగ్ స్టైల్ మాత్రం మార్చుకోరు. ఇప్పుడు నయనతారను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. sye raa,sye raa movie,sye raa movie teaser,sye raa movie promotions,chiranjeevi sye raa,chiranjeevi nayanthara,chiranjeevi nayanthara sye raa movie,sye raa movie promotions,nayanthara sye raa promotions,telugu cinema,చిరంజీవి,నయనతార,సైరా ప్రమోషన్స్,తెలుగు సినిమా,సైరా నరసింహా రెడ్డి టీజర్
చిరంజీవి,నయనతార (ఫైల్ ఫోటో)


కానీ ఇప్పుడు ఈ పద్దతులు తీసి పక్కనబెడుతుంది నయన్. రెండు భారీ సినిమాల కోసం నయన్ ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి ముందుకొస్తుందని ప్రచారం జరుగుతుంది. సైరా సినిమా కోసం ఈమె ప్రమోషన్ చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నటించడానికి ఏకంగా 7 కోట్లు తీసుకుంటుందని తెలుస్తుంది. అయినా ప్రతీ సినిమాకు ముందు ఎంత పారితోషికం తీసుకున్నా కూడా ప్రమోషన్‌కు మాత్రం రానని ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు మాత్రం సైరా కోసం ఆమె కదులుతుందనే తెలుస్తుంది.

Nayanthara sensational decision for Chiranjeevi Sye Raa Narasimha Reddy and Vijay Bigil movies pk నయనతార అంటే లేడీ బాస్.. లేడీ సూపర్ స్టార్.. ఆమెకు నచ్చింది తప్ప మరోటి చేయదు. అక్కడ ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా కూడా తన మనసులో ఏది అనిపిస్తే అది చెప్పే తెగింపు ఈ ముద్దుగుమ్మలో ఉంటుంది. chiranjeevi,nayanthara,nayanthara twitter,nayanthara instagram,nayanthara movies,nayanthara sye raa promotion,nayanthara sye raa narasimha reddy,nayanthara bigil movie,nayanthara promotion,telugu cinema,నయనతార,నయనతార సైరా నరసింహా రెడ్డి,నయనతార చిరంజీవి,నయనతార ప్రమోషన్,తెలుగు సినిమా,నయనతార విజయ్ బిగిల్
నయనతార (Twitter.com/Nayanthara)


రామ్ చరణ్ ఏం చెప్పి ఒప్పించాడో తెలియదు కానీ సైరా కోసం నయనతార ప్రమోషన్ చేయబోతుంది. ఈ సినిమాతో పాటు విజయ్‌తో నటిస్తున్న బిగిల్ సినిమాకు కూడా ప్రమోషన్ చేయబోతుంది నయనతార. ఈ రెండు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు నయన్ హాజరు అవుతుందని తెలుస్తుంది. సైరా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చెన్నై, హైదరాబాద్‌లలో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వాటికి నయన్ వస్తుందనే తెలుస్తుంది. దాంతో పాటు సెప్టెంబర్ 19న జరుగబోయే బిగిల్ ఆడియో వేడుకకు కూడా నయనతారను రావాల్సిందిగా చిత్రయూనిట్ ఆహ్వానించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading