Home /News /movies /

Nayanthara-Vignesh Shivan: నయన‌తార‌తో విఘ్నేష్ శివ‌న్‌ రొమాంటిక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైర‌ల్‌

Nayanthara-Vignesh Shivan: నయన‌తార‌తో విఘ్నేష్ శివ‌న్‌ రొమాంటిక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైర‌ల్‌

బాయ్ ఫ్రెండ్‌ విఘ్నేష్‌తో నయన్ Photo : Instagram

బాయ్ ఫ్రెండ్‌ విఘ్నేష్‌తో నయన్ Photo : Instagram

కోలీవుడ్ ప్రేమ ప‌క్షులు న‌య‌న‌తార‌(Nayanthara), విఘ్నేష్ శివ‌న్(Vignesh Shivan) న్యూ ఇయ‌ర్‌ని రొమాంటిక్‌గా జ‌రుపుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోల‌ను విఘ్నేష్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు

    Nayanthara Vignesh Shivan: ప్ర‌పంచ‌వ్యాప్తంగా న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ అన్ని చోట్ల కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను జ‌రుపుకుంటున్నారు. కాగా మ‌రోవైపు సినీ సెల‌బ్రిటీలు కొంత‌మంది టూర్లు వేసి న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంటుండ‌గా.. మ‌రికొంద‌రు ఇళ్ల‌లోనే కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు. ఇదిలా ఉంటే కోలీవుడ్ ప్రేమ ప‌క్షులు న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ న్యూ ఇయ‌ర్‌ని రొమాంటిక్‌గా జ‌రుపుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోల‌ను విఘ్నేష్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో ఈ ప్రేమ జంట అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. కాగా ఈ సందర్భంగా ఓ మెసేజ్‌ని కూడా ఇచ్చాడు విఘ్నేష్ శివ‌న్.

    నా, మా త‌ర‌ఫున నుంచి మీ, మీకు హ్యాపీ న్యూ ఇయ‌ర్. మా జీవితంలో మ‌రిచిపోలేని ఫేజ్‌కి మేము ఎంట‌ర్ అయ్యాము. గుర్తుండ‌బోయే 2021కు ప‌య‌న‌మ‌వుతున్నాము. అందరూ సంతోషంగా, మంచి ఆరోగ్యం, శాంతి, ప్రేమతో ఉండాల‌ని ఆశిస్తున్నాము. అలాగే విజ‌యాల‌ను సొంతం చేసుకుంటార‌ని భావిస్తున్నాము. వండ‌ర్‌ఫుల్ 2021కు మీ అంద‌రికీ గుడ్‌ల‌క్ అని విఘ్నేష్ కామెంట్ పెట్టారు.




    అయితే విఘ్నేష్, నయన్ కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్రేమ‌లో ఉన్నారు. విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కించిన నానుమ్ రౌడీదాన్ మూవీలో న‌య‌న్ న‌టించ‌గా.. అప్ప‌టి నుంచి ఈ ఇద్దరు ప్రేమ‌లో ఉన్నారు. త‌మ రిలేష‌న్ గురించి ప‌లుమార్లు బ‌హిరంగంగానే ఈ ఇద్ద‌రు వ్య‌క్త‌ప‌రిచారు. అంతేకాదు చెట్టాప‌ట్ట‌లేసుకొని విదేశాలు తిరిగారు. కాగా ఈ ఇద్ద‌రి పెళ్లిపై ఎన్నోసార్లు వార్త‌లు వినిపించాయి. కానీ ఆ మ‌ధ్య‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన విఘ్నేష్.. న‌య‌న్‌కి, త‌న‌కు కొన్ని కోరిక‌లు ఉన్నాయ‌ని.. అవి నెర‌వేరిన త‌రువాత‌నే పెళ్లి అని స్ప‌ష్ట‌త ఇచ్చారు. కాగా ప్ర‌స్తుతం విజ‌య్ సేతుప‌తితో విఘ్నేష్ తెర‌కెక్కిస్తోన్న కాటు వాకుల రెండు కాద‌ల్‌లో న‌య‌న‌తార ఓ హీరోయిన్‌గా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.
    Published by:Manjula S
    First published:

    Tags: Nayanthara, Vignesh Shivan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు