Home /News /movies /

Nayanatara: షూటింగ్ సెట్‌లో నయనతారతో ప్రియుడి రొమాన్స్..వైరల్ ఫోటో

Nayanatara: షూటింగ్ సెట్‌లో నయనతారతో ప్రియుడి రొమాన్స్..వైరల్ ఫోటో

Nayanthara romances with boyfriend vignesh shivan on movie sets pic goes viral

Nayanthara romances with boyfriend vignesh shivan on movie sets pic goes viral

Nayanatara - Vignesh Shivan: లేటెస్ట్‌గా ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో కలిసి సెట్స్‌లో నయనతార రొమాన్స్ చేస్తున్న ఫొటో వైరల్ అవుతుంది

    దక్షిణాది హీరోయిన్స్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న వారిలో న‌య‌న‌తార ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఈమె తాజాగా ర‌జినీకాంత్ అణ్ణాతే షూటింగ్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చింది. అయితే అణ్ణాతే యూనిట్‌కు క‌రోనా సోక‌డంతో అంద‌రూ చెన్నై చేరుకున్నారు. అయితే హైద‌రాబాద్‌లో సెట్స్‌లో ఉన్న‌ప్పుడు విఘ్నేశ్ శివ‌న్‌తో క‌లిసి లొకేష‌న్‌లో రొమాన్స్ చేసింది. ఆ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

    న‌య‌న‌తార విష‌యానికి వ‌స్తే.. ఇప్పటికీ హీరోయిన్స్‌లో న‌య‌న‌తార అంత రెమ్యున‌రేష‌న్ తీసుకునేవాళ్లు లేర‌నే చెప్పాలి. దాదాపు ఐదారు కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది. భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డ‌మే కాకుండా.. సినిమా ప్ర‌మోష‌న్స్‌లోనూ న‌య‌న‌తార పాల్గొన‌దు. సినిమాకు సైన్ చేసేట‌ప్పుడే అలా అగ్రిమెంట్ చేయించుకుని సైన్ పెడుతుంది. ఇన్ని కండీష‌న్స్ ఉన్నా కూడా, న‌య‌న‌తార ఎప్పుడూ బిజీగా ఉంటుంది. వ‌రుస సినిమాలతో బిజీగా ఉంటుంది.

    ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ అణ్ణాతే సినిమాతో పాటు నేట్రిక‌న్.. కాత్తువాకుల్ రెండు కాద‌ల్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్రేమ‌మ్ డైరెక్ట‌ర్ అల్ఫెన్స్‌తో ఫ‌హ‌ద్ ఫాజిల్‌తో క‌లిసి సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేసింది. ఇందులో నేట్రిక్ సినిమాతో పాటు అణ్ణాతే సినిమా సెట్స్‌పై ఉంది. రీసెంట్‌గా ర‌జినీకాంత్ మూవీ అణ్ణాతే షూటింగ్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చింది. అదేస‌మ‌యంలో విఘ్నేశ్ శివ‌న్ కూడా ఆమెకు తోడుగా వ‌చ్చాడు. అయితే.. అణ్ణాతే యూనిట్‌కు క‌రోనా సోక‌డంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో న‌య‌న‌తార ప్రియుడు విఘ్నేశ్ శివ‌న్‌తో క‌లిసి చెన్నై వ‌చ్చేసింది.
    Published by:Anil
    First published:

    Tags: Nayanatara, Vignesh Shivan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు